RIGHT CHOICE IAS ACADEMY, KHAMMAM

Home » Uncategorized » తెలంగాణా ఆధునిక కవులు…

తెలంగాణా ఆధునిక కవులు…

Categories

Advertisements

తెలంగాణ ఆధునిక కవులు

 1. సురవరం ప్రతాపరెడ్డి :

స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పింగళి వెంకటరామిరెడ్డిల సహకారంతో 8 సంవత్సరాల పాటు సమర్థవంతంగా రెడ్డి హాస్టల్‌ను నడిపించారు. ఆంధ్ర జనసంఘంను ఆంధ్ర మహాసభగా సురవరం పేరు మార్చారు. 1930 మార్చి 3న సురవరం అధ్యక్షతన మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. విజ్నాన వర్ధిని పరిషత్‌ను ఏర్పాటు చేసి తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. 1943 మే 28న బూర్గుల రామకృష్టారావు, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావుల సహకారంతో..  ఆంధ్రసారస్వత పరిషత్ ఏర్పాటు చేశారు. 1952లో సురవరం కాంగ్రెస్ అభ్యర్థిగా వనపర్తి నుంచి పోటీ చేసి గెలిచారు.

 

సురవరం ప్రతాపరెడ్డి సంపాదకులుగా 1934లో ‘గోలకొండ కవుల సంచిక’ వెలువడింది. ‘గోలకొండ ఆంధ్ర కవివరేణ్య  కవితా విలాస పుష్పము’ అనే పేరుతో ఈ సంచికను ప్రకటించారు. గోలకొండ సంచిక రావటానికి మూల కారణం “ నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము” అని ముడుంబై వేంకట రాఘవాచార్యులు రాయటం. ఈ సంచికలో మొత్తం 354 మంది కవుల గురించి వివరించారు. ఈ కవులు రాసిన 1418 పద్యాలు ప్రచురించారు. ఈ సంచిక ముఖచిత్రం వీణాపాణియైన సరస్వతి (చేతిలో వీణ ధరించిన సరస్వతి). గోలకొండ కవుల సంచిక ను ఆత్మకూరు సంస్థానాధిపతురాలు సవైరాణీ భాగ్యలక్ష్మమ్మ బహదురుకు అంకితమిచ్చారు.

గోలకొండ పత్రిక వ్యవస్థాపకుడు. పత్రిక స్థాపనకు రాజబహద్దూర్‌ వెంకటరాంరెడ్డి ప్రోత్సహించటంతో 1926 మే 10 తేదీన గోలకొండ పత్రిక ప్రారంభమైంది. ఇది వారానికి రెండు సార్లు వెలువడేది.

కలం పేర్లు : భావకవి రామ్మూర్తి, సంగ్రామ సింహ, విశ్వామిత్ర, చిత్రగుప్త, యుగవతి, బహద్దూర్‌, హితవరి, అమృత కలశి, జంగం బసవయ్య మొదలైనవి వారి కలం పేర్లు.

1940_44 మధ్య వెర్రి వెంగలప్ప కవిలె కట్టలు వంటి శీర్షికలతో హాస్య వ్యంగాత్మక రచనలు చేశారు. 1948 తర్వాత గ్రంథాయల సర్వస్వం పత్రికకు సంపాదకత్వం వహించారు.  1951-52 లో ప్రజావాణి వారపత్రిక ను నిర్వహించారు.

సురవరం రచనలు :

శుద్ధాంతకాంత (నవల) 1917, భక్త తుకారామ్‌ నాటకం, కర్నూలు రాజధాని, నిజాం రాష్ట్ర పాలన, జాగీర్లు, మామిడిపండు, లిపి సంస్కరణ. గ్రామజన దర్పనం, నిజాం రాష్ట్ర పాలనలు, గ్రంథాలయోద్యమం,  సంఘోద్ధరణం (వ్యాసాలు), హైంధవ ధర్మవీరులు, ప్రతాపరెడ్డి కథలు, మొగలాయి కథలు, హరిశర్మోపాఖ్యానం, చంపకీ భ్రమర విషాదం మొదలైనవి.

ప్రతాపరెడ్డి కథలు, మొగలాయి కథల్లో నిజాం కాలం నాటి ఆచార వ్యవహారాలు, మూఢ విశ్వాసాలు, గ్రామీణ ప్రజల జీవిత వాస్తవికత ప్రతిఫలించాయి.

సురవరం రచనలెన్నున్నా పేరు తెచ్చింది మాత్రం ఈ కింది రచనలు :

1.రామాయణ విశేషాలు, వాల్మీకి రామాయణం ఆధారంగా ప్రాచ్య, పాశ్చాత్య దృక్పథంతో ఎన్నో వివరణలిచ్చారు.

2.ఆంధ్రుల సాంఘిక చరిత్ర,(1949) సురవరం కు బాగా పేరు తెచ్చిన రచన ఇది. వేయి సంవత్సరాల ఆంధ్రుల సాంఘిక చరిత్రకు సాహిత్యం ఆధారంగా వివరణ ఇచ్చారు. దీనికి 1995లో కేంద్రప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డ్  కూడా లభించింది.

3.హిందువుల పండుగలు.(1931)

 2.దేవులపల్లి రామానుజారావు :

సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహిత్య కారుడిగా దేవులపల్లి రామానుజారావు ప్రసిద్ధి చెందారు. 1917లో వరంగల్‌లో జన్మించారు. శోభ, గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనోద్యంలో పాల్గొన్నారు.

రచనలు :

నా రేడియో ప్రసంగాలు, తెలంగాణలో జాతీయోద్యమాలు, హైదరాబాద్‌లో స్వాతంత్రోద్యమాలు, యాభై సంవత్సరాల జ్నాపకాలు (1929-1979), కావ్యమాల, వేగుచుక్క, పచ్చతోరణం(ఖండకావ్యం), సారస్వత నవనీతం(వ్యాససంపుటి)  మొదలైనవి. వీటితో పాటు బాలల కోసం జవహార్‌లాల్‌ నెహ్రూ, గౌతమబుద్ధుడు, తెలుగుసీమ, మనదేశం వంటి పుస్తకాలు రాశారు.

ఈయన మంచి అనువాదకులుగా పేరుతెచ్చుకున్నారు. Oxford యూనివర్సిటీ బాలల కోసం ‘సచిత్ర’ ఆక్స్‌ ఫర్డ్‌ డిక్షనరీ రాయించి అచ్చు వేసిందంటే రామానుజారావు ప్రతిభ ఏంటో అర్థమవుతుంది. ఈయన రాసిన ‘బంకించంద్ర ఛటర్జీ’ అనువాద గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించింది.

 

3.కాళోజీ నారాయణరావు :

కాళోజీ నారాయణ రావు అసలు పేరు రఘువీర్‌ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజీ నారాయణరావు. . కాళోజీ వరంగల్ జిల్లా మడికొండలో జన్మించాడు ( కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా రట్టెహళి (ఒకప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం) గ్రామంలో 1914 సెప్టెంబర్ 9న జన్మించారు). కాళోజీ జయంతిని తెలంగాణా అధికార భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కాళోజీని అభిమానులు కాళన్న, ప్రజాకవి అని పిలుచుకుంటారు. కాళోజీ మిత్రులతో కలిసి ‘వైతాళిక సమితి’ అనే సంస్థను స్థాపిపంచారు. కాళోజీ మొదటి కవితా సంకళనం 1953లో వెలువడింది. అలంపురంలో శ్రీశ్రీ ఆవిష్కరించారు. కాళోజీని ‘నిఖిలాంధ్ర కవి’ అని శ్రీశ్రీ అన్నారు.

కాళోజీ  “నా యాస – నా నేల – నా జాతి – నా సంస్కృతి” అని చాటాడు.

కాళోజీ రాసిన కథలు : తెలియక ప్రేమ – తెలిసి ద్వేషము, ఎన్నిక కథ, రెండు గింజలు.

ఖలీల్‌ జిబ్రాన్‌ను, ది ప్రాఫెట్‌ ను తెలుగోలోకి ‘జీవనగీత’ పేరుతో అనువదించారు. కాళోజీ కవితలన్నీ ‘నా గొడవ’ పేరుతో ప్రచురింపబడ్డాయి.

సాహిత్య రంగానికి చేసిన సేవకు, సమాజిక సేవకు కాళోజీకి పద్మవిభూషణ్‌, కళాసాగర్‌ పురస్కారాలు లభించాయి.

ఇతర రచనలు: అణాకథలు ( 1941) కాళోజీకథలు (1943) పార్థివ వ్యయం ( 1946) , జీవనగీతాలు (1968), తెలంగాణా ఉద్యమకవితలు ( 1969/70) కాళోజీకథలు (2000)

అనువాదాలు: ఎన్.జి. ఫడ్కే నవల ( అంజలి ), సానే గురూజీ రచనలు ( భారతీయ సంస్కృతి)

“పుటక నీది – చావునీది – బ్రతుకంతా దేశానిది” అనే మినీ కవితను రాసింది కాళోజీ. జయప్రకాశ్‌ నారాయణ మరణించినపుడు ఈ కవితను రాశారు.

చివరి వరకు గాంధేయ వాదిగా జీవించాడు.

కాళోజీ కవిత్వంలోని ముఖ్యమైన పంక్తులు :

“వీర తెలంగాణ నాది – వేరు తెలంగాణ నాది”

“ఉదయం కానేకాదనుకోవడం నిరాశ /ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ”

“అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు / సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా ?”

“ అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు – ఏ పాటి వాడో చూడు / పెట్టుకొనే టోపీ కాదు – పెట్టిన టోపీ చూడు”

“అన్నపు రాసులు ఒక చోటా – ఆకలి మంటలు ఒక చోట / హంస తూలికలొకచోట – అలసిన దేహాలొకచోట”

“విపణి వీధి – తపోవనం / చాకిరేవు – శాసన సభ

సానికొంప – సాధుమఠం / ఎచటైతేం – ఎచటైతేం

పోటీపడి కాటులాడ ఎచటైతేం ”

“ ఒక్క సిరాచుక్క – లక్ష మెదళ్ల కలయిక ”

“ ప్రతి చాదస్తం ఒక దేవుడే / ఏదో ఒక రూపంలో గోకుడే ”

“ నాగొడవనునది – నఖరాలు లేనట్టిది / నాజూకుది కానట్టిది

నాగొడవనునది అక్షరాల జీవనది ”.

అధికారంలో ఉన్నవాడే అన్యాయం చేస్తుంటే.. అదుపులో పెట్టే రాజ్యం ఆసరాగా వినకుంటే.. ప్రతిహింసకు పూనుకున్న ప్రతి నరుడూ నరసింహుడే.. అంటాడు కాళోజీ.

ఇతర విషయాలు: 1930 నుంచి గ్రంథాలయల ఏర్పాటుకై కృషి చేశాడు.

అక్షర జ్యోతి కార్యక్రమాలు నిర్వహించాడు. 1945లో పరిషత్ మహాసభలు నిర్వహించి కాకతీయ కోటలో.. జాతీయ జెండా ఎగురవేశాడు. దీంతో.. కాళోజీనీ నగర  బహిష్కరణ చేశారు. 1977 లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి.. జలగం వెంగళరావుపై పోటీచేశారు. 1997లో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించాడు. 1968లో జీవన గితికను అనువదించినందుకు రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ అనువాద పురస్కారం పొందారు.

1992లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవడాక్టరేట్ అందుకున్నారు. 2002లో చనిపోయారు.

కాళోజీ నారాయణరావు సాహిత్యంపై.. డాక్టర్ ఎన్. యాదగిరిరావు దిశ గ్రంధాన్ని రాశారు.

కాళోజీ శతజయంతి ఉత్సవాలను.. 2014 సెప్టెంబర్ 9న ఘనంగా నిర్వహించింది. వరంగల్ లోని బాలసముద్రంలో కాళోజీ పేరుతో కళాక్షేత్రం నిర్మిస్తున్నారు.

ఇతర అంశాలు: నా భారతదేశ యాత్ర (1941), పార్థీవ న్యాయం (1946), తుది విజయం మనది నిజం (1962), బాపు! బాపు!! బాపు!!! (1995)

దాశరథిగారు కాళోజీ రచనలను “సమకాలీన చరిత్రపై రన్నింగ్‌ కామెంట్రీ”గా పేర్కొన్నారు.

కాళోజీ 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

మరణానంతరం తన శరీరాన్ని కాకతీయ మెడికల్‌ కాలేజీకి డొనేట్‌ చేశారు.

 

4.వానమామలై వరదాచారి :

వానమామలై వరదాచార్యులు గారు వరంగల్‌ జిల్లా మడికొండ గ్రామంలో 1912 ఆగస్టు, 16న జన్మించారు. ఈయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పద్యకావ్యం ‘పోతన చరిత్రము ‘. ఈ కావ్యాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారు. అభినవ పోతన ఈయన బిరుదు. మణిమాల, జయధ్వజం అనే ఖండకావ్యాలు రచించారు. ఈయన గేయకావ్యాలలో ‘విప్రలబ్ద’ ప్రసిద్ధి చెందినది. ‘కూలిపోయే కొమ్మ’ అనే వచన కవితా సంపుటి రాశారు. ఈయన 13 ఏటనే ‘దాగురింతలు’ అనే భక్తిపూర్వక గీతమాలిక రాశారు. ఇందులో నాలుగు వందల పాదాలుంటాయి. ఈయన వైశాలిని అనే నాటకం రాశారు. వీరి తొలి కావ్య వసంపుటి మణిమాల. ఈయన మరాఠీ నుంచి అనువదించిన రచన – గీతా రామాయణం. బువ్వకు సరిపోవునన్ని గవ్వలు లేకపోయినా మువ్వపు కైతలు రచించిన కవిగా పేరొందారు.

వామనామలై గారికి గండపెండేరం తొడిగిన ప్రముఖులెవరు – పి.వి.నరసింహారావు .

 1. ఒద్దిరాజు సోదరులు :

ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు లను ఒద్దిరాజు సోదరులని పిలుస్తారు. వీరిది వరంగల్‌ జిల్లా ఇనుగుర్తి గ్రామం. రాఘవ రంగారావు ఆయుర్వేద వైద్యులైన పండిత కవి.  ఒద్దిరాజు సోదరులు ‘అష్టాధ్యాయి’ వ్యాకరణానికి తెలుగు వ్యాఖ్యానం చేశారు.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ‘రెక్‌’ నవలను ‘నౌకాభంగం’ పేరిట  తెలుగులోకి అనువదించినది –  ఒద్దిరాజు సీతారామచంద్రరావు.

‘ నల్లులు కుట్టినపుడు ’ అనే మత్కుణోపాఖ్యానం రాసినది – ఒద్దిరాజు రాఘవరంగారావు.

వీరి రచనలు :

ఉపదేశరత్నమాల, సంస్కృత వ్యాకరణం, భక్తిసార చరిత్ర (నాటకం), రుద్రమదేవి, స్త్రీ సాహసం (నవలలు), శశవిషాణం, సౌదామినీ పరిణయం(కావ్యాలు).

The flower , The blessings, The pride of the wealth.. వీరి ఆంగ్ల రచనలు.

కృష్ణస్తవం, శ్రీస్తవం, శుకపక్షీయమ్‌, ఉత్సవానందబాణమ్‌ మొదలైనవి సంస్కృత రచనలు.

 1. సుద్దాల హనుమంతు :

సుద్దాల హనుమంతు నల్లగొండ జిల్లా పాలడుగు గ్రామంలో జన్మించారు. నిజాం వ్యతిరేక వీరుడు, ప్రజల పాటగాడు సుద్దాల హనుమంతు. ఈయన గాయకుడైనప్పటికీ దర్జీపని చేశాడు. మా భూమి సినిమాలో సుద్దాల హనుమంతు రాసిన “పాలబుగ్గల జీతగాడా” అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యునిగా చేరి తన పాటల ద్వారా ప్రజలను ఉత్తేజితుల్ని చేశారు. ఆ రోజుల్లో ఉపన్యాసాల కంటే పాటే జనంలోకి చొచ్చుకుపోయింది. వెట్టి చాకిరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అనేక పాటలు రాశారు. ఇవన్నీ ‘వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. ఆర్యసమాజ్ ప్రభావంతో ఒక హరిజన యువతిని పెళ్లిచేసుకున్నాడు. ప్రజాశక్తి పేపరును రహస్యంగా తెప్పించి… ప్రజలను పోరాటాలవైపుకు మరల్చాడు.

ఈయన పాటలలో ముఖ్యమైనవి :

వీణను మీటేది చెయ్యి, నాగలి దున్నేది చెయ్యి, రైలింజను నడిపేది చెయ్యి.

పల్లెటూరి పిల్లగాడా- పసులుగాసే మొనగాడా.

ఔనంటారా ఇది కాదంటారా మరి, ఏమంటారో చిందొరా ఓ పెద్దొరా.

7.దాశరథి కృష్ణమాచార్యులు :

దాశరథి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. ఖమ్మం జిల్లా(వరంగల్ జిల్లా మానుకోట ) చినగూడూరులో 1927 జులై 22న జన్మించారు.( 1987 నవంబర్‌ 5న మరణించారు.) దాశరథి తండ్రి వేంకటాచార్యులు ‘దాశరథి’ అనే పత్రికను నడిపారు. దాశరథిపై కమ్యూనిజం ప్రభావం ఎక్కువ. నిజాంను వ్యతిరేకించి పోరాటంలో పాల్గొన్నందుకు దాశరథి 16 నెలల జైలు శిక్ష అనుభవించారు. ‘చలిగాలి’ అనే పేరుతో ఆశువుగా 27 కందపద్యాలు చెప్పారు. అధ్యాపకుడిగా, తనిఖీ ఇన్‌స్పెక్టరుగా, ఆకాశవాణిలో ప్రయోక్తగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆస్థాన కవి పదవి పొందిన తెలంగాణ కవి దాశరథి. ఈయన తొలి కృతి – అగ్నిధార.( నోట్ అగ్నిధారను.. నిజామాబాద్ జైలు సహవాసి.. వట్టికోట అళ్వారు స్వామికి అంకితమిచ్చాడు. ) మరో కవితా సంపుటి రుద్రవీణ ను.. తెలంగాణా ప్రజలకు అంకితమిచ్చాడు.  ఈయన రాసిన ‘తిమిరంతో సమరం’ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. ‘కవితా పుష్పకం’ అనే కావ్యానికి ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. దాశరథి ‘బాల సరస్వతి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువును’  రాశారు. గీతగోవింద వ్యాఖ్యానం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దాశరథిని కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించింది. దాశరథిని శాంత విప్లవవాది అని జి.వి.సుబ్రహ్మణ్యం అంచనా వేశారు. 1953లో తెలంగాణా రచయితల సంఘాన్ని స్థాపించాడు.

దాశరథి రచనలు :‌

రుద్రవీణ, మహాంద్రోదయం, మార్పు నా తీర్పు, ద్వజమెత్తిన ప్రజ, మహాబోధి, పునర్నవం, అమృతాభిషేకం, నవమంజరి, గాలిబ్‌ గీతాలు, ఆలోచనా లోచనాలు, అమృతవల్లి, ధ్వజమెత్తిన ప్రజ (కవిత్వం ).  మస్తిష్కంలో లేబరేటరీ ( విజ్నాన శాస్త్ర కవిత).

రుబాయి, గజల్‌ ప్రక్రియలను మొదటిగా తెలుగులోకి అనుదించినది – దాశరధి. హీరాలాల్‌ మోరియా కవితలను తెలుగులోకి అనువదించారు.

ధాశరథిపై పరిశోధన చేసి సిద్ధాంతగ్రంథం రాసినవారు – ఆచార్య భావన్‌.

“నరుడు నరుడౌట దుష్కరమ్ము సుమ్ము” – ఇది గాలిబ్‌ కవితకు ఉదాహరణ.

“తలనిండ పూలదండ దాలిచిన నారాణి….” ఇది దాశరథి రాసిన లలిత గీతం.

వాగ్ధానం సినిమాకు దాశరథి తొలి పాట రాశారు. సినిమా పాటల కోసం ఖవ్వాలి అనే ఉర్దూ పాటల్ని అనుసరించారు. సినిమాల్లో వీణ పాటలు ఎక్కువ రాసిన ఘనత దాశరథికే దక్కుతుంది. పొట్టివాడైనా గట్టివాడని చాలా మంది సంబోధించారు. ఈయన రాసిన నాటికల సంపుటి ‘నవమి’. ఈయన మహాశిల్పి జక్కన అనే చారిత్రక నవల రాశారు.

టూటేగీనహీ – ఝాకేంగీనహీ.. అని గర్జించిన కవి – దాశరథి.

అగ్నిధార కావ్యంలో ‘పీడిత ప్రజావాణికి మైక్‌ అమర్చి అభవాదులకున్‌ వినిపించెన్‌’ అని చాటారు. తెలుగు పతాకం ఎరుగని దిశయే లేదు.. తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు.. అని అన్నారు.

“నడిరేయి ఏజాములో స్వామి నిను చేరదిగివచ్చెనో” అన్న ప్రసిద్ధమైన పాట రాసినది – దాశరథి.

దాశరథి  ఆత్మకథ  – యాత్రాస్మృతి (మరణానంతరం మృద్రించారు).

నిజామాబాద్‌ జైల్లో(ఖిల్లా ) ఉన్నపుడు గోడపై బొగ్గుతో రాసిన పద్యం :

“ ఓ నిజాము పిశాచమా? కానరాదు / నిన్నుబోలిన రాజు మాకెన్నడేని?

తీగెలను తెంపి అగ్నిలో దింపినావు / నా తెలంగాణ కోటి రత్నాల వీణ.” (అగ్నిధార )

దాశరథి కవిత్వంలోని ప్రసిద్ధ పంక్తులు :

“ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్‌ పడగొట్టి…. తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే”

“ననుగనిపెంచినట్టి కరుణామయి నా తెలంగాణ”

“నేనురా తెలగాణనిగళాల తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను”

“జండా ఒక్కటి మూడు వన్నెలది దేశం ఒక్కటే..”

“ఉన్నదాన్ని వున్న వాళ్లందరిలో పంచి / ఉన్నంతలో అందరం కలిసి భోంచేసి”

“అనాదిగా సాగుతోంది – అనంత సంగ్రామం / అనాథునికీ ఆ గర్భశ్రీనాథునికీ మధ్య”

“గతాన్ని కాదనలేను  – వర్తమానం వద్దనబోను / భవిష్యత్తు వదులుకోబోను – కాలం నాకంఠమాల”

“  మా నిజాం రాజు జన్మజన్మల బూజు”

“హింసాయుద్ధం ఔట్‌ డేటెడ్‌ అని నేనంటాను / శాంతి ఒక్కటే మానవ జాతికి సిరియగు సాల్వేషన్‌”

నాగీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళమ్మున అగ్గి పెట్టెదను..

మూసీ నది మీద.. నేత్రపర్వం అనే కావ్యంలో.. ఓసీ మూసీ… అనే కవిత రాశాడు.

పీడిత ప్రజావాణికి మైక్ అమర్చి అభివాదులకున్ వినిపింపజేసెదన్..

మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడిచిరా… నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగవలె నడిచిపో..

బేడాకు దొరికె పెన్సిల్ ముక్కులో.. జగత్తుకు ప్రాణం ప్రసాదించిన కార్బన్ పరమాణువు..

అడుగడుగునా.. ఎడదనెత్తురు గడగడమని తాగినావు… అంటూ నిజాం నిరంకుశ పాలనను ఎత్తిచూపారు

కోటి కోటి దీపాలను బాటలలో , కోటలలో నాటండి ప్రజల్లారా.. వేటాడండి తమస్సును అంటూ చైతన్యదీప్తిని నిపాంరు

సినిమాపాటలు:.. ఖుషీ ఖుషీగా నవ్వుతూ.. చలాకి పాటలు..

నడిరేయి ఏజాములో నిను చేర దిగివచ్చునో..

 

 1. సి.నా.రె :

సినారె పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేటలో జులై 29న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. అంతేకాకుండా అధికారభాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షులుగా, ప్రభుత్వ సాంస్కృతిక భాషావ్యవహారాల సలహాదారులుగా, సంస్కృతిక మండలి అధ్యక్షునిగా అనేక పదవులనలంకరించారు. ఈయనకు పద్మభూషన్‌, సోవియెట్‌ లాండ్‌ నెహ్రూ అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, లోక్‌నాయక్‌ పురస్కారాలు లభించాయి. సినారె రాసిన ‘విశ్వంభర’కు 1988 జ్నానపీఠ్‌ అవార్డు లభించింది. కళాశాల విద్యార్థిగా ఉన్నపుడు రోచిస్‌, సింహేంద్ర పేరుతో రచనలు చేశారు. జలపాతం కావ్యాన్ని దాశరథికి అంకితమిచ్చారు. సినారె రాసిన ‘రామప్ప’ సంగీత రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది. నాగార్జున సాగరం గేయకావ్యాన్ని అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు సమక్షంలో గానం చేశారు.

“భాషే నేను తెచ్చుకున్న తీయని వరం / భాషే నేను కట్టుకున్న జీవన గోపురం” అన్నారు.

సినారే తిలక్‌లాగే రెండంచుల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలడు, అమృతం కురిపించగలడని ఎన్‌.గోపి అన్నారు.

నవ్వనిపువ్వు, అజంతా సుందరి.. గేయ నాటికలు. కర్పూర వసంతరాయలు.. గేయ కావ్యం. దీన్ని మల్లంపల్లి సోమశేఖరశర్మకి అంకితం చేశారు.

మట్టీ – మనిషీ – ఆకాశం .. సినారె దీర్ఘకావ్య ప్రక్రియకు చెందినది.

ఈయన అయిదు పంక్తులతో చేసిన వినూత్న ప్రయోగ రచన – ప్రపంచ పదులు.

సమీక్షణం, వ్యాసవాహిని, మావూరు మాట్లాడింది.. సినారె వ్యాస సంపుటాలలో ముఖ్యమైనవి.

ఆధునిక కవిత్వము – సంప్రదాయము- ప్రయోగము.. సినారె సిద్ధాంత గ్రంథం.

పగలే వెన్నెల – సినిమా పాటల సంపుటి.

తెలుగు గజళ్లు సొంతంగా రాసి, పాడి. సీడీలుగా విడుదల చేశారు.

సినారె సమన్వయ వాద కవి. జ్నానపీఠ్‌ పురస్కారం అందుకున్న తొలి తెలంగాన కవి. జ్నానపీఠ్‌ అందుకున్న విశ్వంభరను భీమ్‌సేన్‌ నిర్మల్‌, అమరేంద్ర లు హిందీ, ఆంగ్లంలోకి అనువదించారు.

సినారె కవిత్వం నుంచి ముఖ్యమైన పంక్తులు :

నా పేరు కవి ఓ ఇంటిపేరు చైతన్యం / ఊరు  సహజీవనం – తీరు సమభావనం.

మూటకున్న విలువ మాటకుందా..?, చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు…,

పరుల బాధ తన బాధగా పంచుకున్నవాడే కవి..,

“నా వచనం బహువచనం/ నా వాదం సామ్యవాదం/కవిత్వం నా మాతృభాష/ఇతివృత్తం మానవత్వం” అని ప్రకటించాడు.

తాను రాసిన సినిమా పాటలను విశ్లేషిస్తూ – పాటలో ఏముంది? నా మాటలో ఏముంది.. అనే గ్రంథం రాశారు.

వరప్రసాదరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీ వరప్రసాద్‌ ప్రధాన సంపాదకులుగా సినారె రచనలపై వెలువడిన వ్యాస సంకలనం – నిరంతర సాహితీ మూర్తి సినారె.

సినారె పాటలు రాసిని తొలి సినిమా – గులేబకావళి కథ.

పగలే వెన్నెలా జగమే ఊయలా., నన్ను దోచుకుందువతే వన్నెల దొరసాని, చదువురాని వాడివని దిగులు చెందకు, ఊహలు గుసగుసలాడే.. నా హృదయము ఊగిసలాడే, వస్తాడు నారాజు ఈ రోజు.. మొదలైన ఎన్నో పాటలు రాశారు.

ఇతర రచనలు:

మనిషి – చిలక ,     ముఖాముఖి ,     భూగోళమంత మనిషి

దృక్పథం ,     కలం సాక్షిగా   ,    కలిసి నడిచే కలం  ,     కర్పూర వసంతరాయలు

మట్టి మనిషి ఆకాశం,     తేజస్సు నా తపస్సు,     నాగార్జున సాగరం ,     విశ్వనాథ నాయడు

కొనగోటి మీద జీవితం ,     రెక్కల సంతకాలు ,     వ్యక్తిత్వం

వ్యాసాలు:     పరిణత వాణి

గేయనాటికలు:

–   అజంతా సుందరి : 1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు.

1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి.

ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం

–  వెన్నెలవాడ

రచనారంగమే కాక ఆయన తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.

సినిమా పాటలు:                   చదువురాని వాడవని దిగులు చెందకు

1962    గులేబకావళి కథ       నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని

1963    బందిపోటు                  వగలరాణివి నీవే సొగసుకాడను నేనే

1963    కర్ణ                                 గాలికి కులమేది నేలకు కులమేది

1963    లక్షాధికారి             దాచాలంటే దాగవులే దాగుడుమూతలు సాగవులే,

మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది

1964    మంచి మనిషి         అంతగా నను చూడకు మాటాడకు, వింతగా గురిచూడకు వేటాడకు

1964    రాముడు భీముడు తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే

1968    బంగారు గాజులు    అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి

1972    బాలమిత్రుల కథ     గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయీ

1974    అల్లూరి సీతారామరాజు         వస్తాడు నా రాజు ఈ రోజు

1975    అందమైన అనుబంధం           ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే

1975    బలిపీఠం                                      మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి

1975    ముత్యాల ముగ్గు     గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ

1985    స్వాతిముత్యం        లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి

1997    ఒసే రాములమ్మా    కడవమీద కడవపెట్టి.. ఒసే రాములమ్మా

2001    ప్రేమించు                                     కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా

2003    సీతయ్య                           ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ ( నంది పురస్కారం )

2009    అరుంధతి                                    జేజమ్మా జేజమ్మా

 

9.శేషాద్రి రమణ కవులు :

రమణ కవులు గుంటూరు వాస్తవ్యులైనప్పటికీ.. హన్మకొండను ఆవాసంగా చేసుకొని సాహిత్య పరిశోధన చేశారు. జయంతి రామయ్య పంతులు కోరికపై తెలంగాణ అంతటా పర్యటించి అనేక తాళపత్ర ప్రతులను, శాసనాలను సేకరించి ఆంధ్రసాహిత్య పరిష్యత్‌కు చేర్చారు. వీరు రామప్ప, పాకాల, కొలనుపాక శాసనాలను ప్రకటించారు. సురవరం సంకలనం చేసిన ‘గోలకొండ కవుల చరిత్ర’కు పూర్వకవి పరిచయం రాశారు. రుద్రమదేవి గణపతిదేవుని కూతురని, మల్లినాథసూరి, పల్లికార్జున పండితుడు తెలంగాణకు చెందిన వారని నిరూపించారు.

రచనలు :

వసుచరిత్ర వ్యాఖ్య, ఆంధ్రపదవిధానము, మేదినీ హారావళి, నిఘంటు వివరనణము మొదలైనవి వీరి రచనలు.

 

10.మాదిరెడ్డి సులోచన :

మాదిరెడ్డి సులోచన 1936లో శంషాబాద్‌లో జన్మించారు.

తెలంగాణ మాండలికంలో నవల రాసిన మొట్టమొదటి రచయిత్రి- సులోచన.

ఈమె సుమారు 65 నవలలు, 150 కథలు, 2 నాటకాలు, 10 ఏకాంకికలు రాశారు.

ఈమె రచించిన మొదటి నవల ‘జీవనయాత్ర.’.

తెలంగాణ ఫ్యూడల్‌ సంస్కృతిని సంధ్యారాగం, పంతులమ్మ, తరం మారింది మొదలైన నవలల్లో కళ్లకు కట్టినట్లు చిత్రించారు. ఇందులో ‘తరంమారింది’ నవలను తెలంగాణ మాండలికంలో రాసింది.

 

11.తెన్నేటి సుధాదేవి :

1952లో వరంగల్‌ జిల్లా హన్మకొండలో జన్మించారు. సమాజ సమస్యలపై ఈమె కళాన్ని ఎక్కుపెట్టారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల సమస్యలపై రచనలు చేశారు. వీరి రచనలలో స్త్రీల అభ్యుదయం గురించి ఎక్కువగా కనిపిస్తుంది.

సామెతల్ని ఆధారంగా చేసుకొని నాటికలు రాసిన తొలి తెలుగు రచయిత్రి.
రచనలు :

వికసించని వేదన, రవళి, అరవింద అనే కథల సంపుటులు, ఉదయకాంత (గేయ కవితా సంకలనం), సామెత నాటికలు మూడు సంపుటాలు, లిటిల్‌ డిటెక్టివ్‌ అనే నవల రాశారు.

1985లో ప్రియదర్శిని అకాడమీ వారి ‘ఉత్తమ కథా రచయిత్రి’ అవార్డు అందుకున్నారు.

సుమారు 500 తెలుగు సామెతల ఆధారంగా ‘అమృతవాణి’ కోసం రాసిన రేడియో నాటికలు  రాశారు.

ఈమె రచనాశైలి పదాడంబరం లేని అందమైన సరళి.

 

12.గడియారం రామకృష్ణ :

మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో 1919లో జన్మించారు. సురవరం ప్రతాపరెడ్డికి సహచరుడైన రామకృష్ణ, ఆయన పరిశోధన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు. అలంపూరు క్షేత్ర అభివృద్ధికి కృషి చేయటమే కాకుండా విశేష పరిశోధన జరిపి చరిత్రను వెలుగులోకి తెచ్చారు. శాసనాలు, వాస్తు శిల్పం, భాష మొదలైన అంశాలపై పరిశోధనలు చేశారు. ఈయన ‘రన్నని గధాయుద్ధం’ ను తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు కన్నడ సాహిత్య చరిత్రను పరిచయం చేశారు.

రచనలు :

శతపత్రము ( ఆత్మకథ ), మాధ విద్యారణ్య, పాంచజన్యం ( ఖండకావ్య సంపుటి ), దశరూపక సారం, భారతదేశ చరిత్ర ( క్షేత్ర చరిత్ర), ఉమామహేశ్వర చరిత్ర మొదలైన రచనలు చేశారు. సుజాత పత్రికకు సారథ్యం వహించిన రామకృష్ణ.. పరిశోధనాత్మక రచనలను పోత్సహించారు.

ఇతని సేవలకు 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

 

13.సామల సదాశివ :

సామల సదాశివ ఆదిలాబాద్‌ జిల్లాలోని దహెగోన్‌ మండలం తెలుగుపల్లెలో జన్మించారు. ఈయన బహుభాషా పండితులు, అనువాదకులు, సంగీతజ్నులు. ఈయన పేరు చెప్పగానే గుర్తొచ్చే రచన ‘యాది’. కావ్యసుధ, సాంబశివ శతకం, నిరీక్షణములు, ప్రభతము వంటి పద్య రచనలు చేశారు. సాంబశివ శతకాన్ని తేటగీతి ఛందస్సులో రాశారు. విద్యార్థుల కోసం సరళంగా ఉపదేశ పద్యాలను.. మంచి మాటలు.. పేరుతో రాశారు. ఈయన రచించిన ‘స్వరలయలు’ అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. యాది, స్వరలయలు వార్త పత్రికలో(ఆదివారం) ప్రచురించబడ్డాయి. అబ్జద్‌ రుబాయిలను పద్యరూపంలో ప్రకటించారు. ఎర్రన భారతంలోని ధర్మోపాఖ్యానం అనే కథను ఖండకావ్యంగా మలిచారు. అమ్రపాలి, మీరాభాయి ఈయన ఖండకావ్యాలే. సదాశివ ఎక్కువ కాల ఉపధ్యాయులుగా పనిచేశారు.

 14.కపిలవాయి లింగమూర్తి :

కపిలవాయి లింగమూర్తి మహబూబ్‌నగర్‌ జిల్లా బల్లూర్‌ మండలంలోని జినుకుంట గ్రామంలో జన్మించారు. నాగర్‌కర్నూల్‌ పేరు చెప్పగానే కపిలవాయి గుర్తొస్తారు. మరుగున పడ్డ తాపత్రాలను  పరిష్కరించి ప్రచురించారు. దేవాలయాల కథలకు, చారిత్రకతకు ప్రాణం పోసి ‘పరిశోధక పంచాననుడు’ అనిపించుకున్నారు.

బిరుదులు : కవితా కళానిధి, విద్వన్మణి, కవికేసరి కవికుల వైతాళికుడు మొ..వి.

రచనలు : సాలగ్రామశాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, శ్రీమత్‌ప్రతాపగిరి ఖండం, దుర్గా-భర్గా-ఆర్య శతకాలు, స్వర్ణ శకలాలు(విశ్లేషణాత్మక విమర్శనాత్మక గ్రంథం) మొ..వి.

పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర అనే అచ్చ తెలుగు కావ్యానికి వ్యాఖ్య రాశారు.

పాల్కూరికి సోమ ప్రారంభించిన ఉదాహరణ కావ్య ప్రక్రియను కొనసాగించి రాశారు. అందులో శ్రీనివాస వైజయంతీ, కల్యణోదాహరణం, సుబ్రహ్మణ్యోదాహరణం మొ..వి ముఖ్యమైనవి.

బాలసాహిత్య రచనలు :‌ ఉప్పునూతల కథ, మూడుతరాల ముచ్చట్లు మొ..వి.

పాలమూరు జిల్లా మాండలిక పదాలను సేకరించి విపులంగా పుస్తకరూపంలో వెలువరించారు.

పాలమూరులోని ఉమామహేశ్వర క్షేత్ర ప్రాశస్త్యాన్ని హరికథగా రాశారు.

 

 1. సంపత్కుమార :

కోవెల సంపత్కుమారాచార్య జన్మస్థలం వరంగల్‌. విమర్శకుడిగా పేరు పొందారు. సుప్రసన్నతో కలిసి హృద్గీత అనే కావ్యం రాశారు. ఈయన రాసిన చేరా శతమానం ప్రసిద్ధి చెందినది. ఆధ్యాత్మిక శతకం ‘అంతర్మథనం’. అపర్ణ గేయకావ్యకర్త అనే పేరుంది. ఆముక్త అనే పద్య కావ్యం రాశారు. అలెగరి పద్ధతిలో కవిత్వం రాసిన ఛందో పరిజ్ననం గలవారు.

ముఖ్యమైన కవితలు : జనాంతికం, నాటకాంత, వసుధైక కుటుంభీకుడు, రోజువారి మొదలైనవి.

 

16.సుప్రసన్న :

సుప్రసన్న పూర్తి పేరు కోవెల సుప్రసన్నాచార్యులు. జన్మస్థలం వరంగల్.

రచనలు : నేజశ్చక్రము, దు:ఖయోగిని, అధునా మొదలైన కావ్యాలు రాశారు. రుతంభరి, కన్నీటి కొలను, సంపరాయం మొదైలనవి వచన కావ్యాలు. ‘పాండిచ్చేరి గీతాలు పన్నెండు’ విశిష్ట పద్య రచన. ‘శవాభిసారిక’ అనే విలక్షణ వచన కావ్యం రాశారు.

అరవిందుల తాత్వికతను , భారతీయతను భూమికగా చేసుకొని కవిత్వం రాశారు.

ముఖ్యమైన కవితలు ‌: ఆనందమోహిని, ఆశావాది, శుషకక్షాళనానికి పంపండి, పగిలిన అద్దం, అమృత పుత్రులు మొదలైనవి.

 

17.పేర్వారం జగన్నాథం :

పేర్వారం జగన్నాథం కవిత్వంలో ఎక్కువగా శ్లేషార్థాలు కనిపిస్తాయి.  పేర్వారం రాసిన వ్యంగకావ్యం – వృషభపురాణం(అధిక్షేపకావ్యం). సాగర సంగీతం అనే కావ్యాన్ని రాశారు.

పద్యకావ్యాలు : ఇంద్రద్యుమ్నీయం, సౌదామినీ పరిణయం.

వృషభపురాణం వంటి మరొక రచన గరుడపురాణం.

ముఖ్యమైన కవితలు : శ్రీముఖం, రోడ్డు రోలర్‌, ధర్మస్యదయాలకొండ, కాలజ్నానతత్వం, ఔటాఫ్‌ సిలబస్‌, గుడినే మింగిన వానికి (దీర్ఘకవిత) మొదలైనవి.

పేర్వారం మంచి విమర్శకులు. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, పీఠికల ద్వారా తెలుగు విమర్శ కొత్త ద్వారాలు తెరిచారు. 1987లో ‘అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు’ వెలువరించారు. ఇది చర్చోపచర్చలకు దారితీసింది. 2002లో ‘తెలుగులో దేశీయ కవితా ప్రస్థానం’ అనే మరో వ్యాస సంకలనాన్ని తీసుకొచ్చారు.

 

18.ఎన్‌.గోపి :

ఎన్‌.గోపి నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. గోపి రాసిన అపూర్వమైన దీర్ఘకావ్యం – జలగీతం. ఈ కావ్యాన్ని జలబ్రహ్మ, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌కు అంకితిమిచ్చారు. జలగీతం వైజ్నానిక భూమిపై మొలచిన తాత్విక మానవీయ కవిత. ఈ కావ్యం భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యింది. నానీల కవితా రూప సృష్టికర్త అయిన గోపీని నానీల నాన్న అంటారు. నానీలంటే నావీ, నీవి వెరసి మనవి అని అర్థం. చిన్న పిల్లల్లాగ చిట్టి కవితలని అర్థం.

నానీల లక్షణాలు : నాలుగు పదాలతో ఒక్కొక్క పాధంలో 20-25 అక్షరాలతో రాస్తారు. చివరి రెండు లేదా ఒక పాదంలో ఒక చరుపు, విసురు (పంచ్‌) ఉండాలి. ఇప్పటి వరకు 200లకు పైగా నానీల కవితా సంపుటాలొచ్చాయి. గోపి 730 నానీలు రాశారు. గోవాలో సముద్రం, మరో ఆకాశం (ఇంగ్లండ్‌ కవితలు) వంటి యాత్రా కవితలు రాశారు.

గోపి కవిత్వంలోని కొన్ని పంక్తులు :

తంగెడు పూలు అంటే ఒప్పుకోను /బంగరు పూలు/పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు.

నా పద్యాలే నన్ను మనిషిగా/మనిషిగా మనిషిగా మారుస్తాయి /వస్తువు దొరకనపుడు కవిత్వం పస్తులుంటుంది.

ఇప్పుడు నగరం నగరంలో వుండక /పల్లెల్లోకి కూడా ప్రవహిస్తుంది.

అమ్మ రుణం తీరదు / అమ్మకు అమ్మనై పుడితే తప్ప.

లక్షల్తో త్యాగాన్ని వెలిగించి/ఇంట్లో ఎండిన డొక్కల కోసం /ఇల్లిల్లూ తిరుగుతుంటాడు (ఫ్రీడం ఫైటర్‌ ).

నానీలు :

కుండముక్కలైందా/కుమిలిపోకు/మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది.

రొయ్య మడుగుల కింద/భూమాత కళేబరం వలవేస్తే/ డాలర్లే పడ్డాయి.

భాషంటే /డ్రాయింగ్‌ రూం చిలక/మరియాస/ వంటింటి పరిమళం

తన ఊళ్లో తానే  పరాయిదైంది/ తెలంగాణపల్లె గాయపడిన చెల్లె.

సచివాలయం వెయ్యికాళ్ల/ జెర్రి కాళ్లన్నీ కదుల్తాయి/ నడక సాగదు.

జలగీతం నుంచి :

జలం ఒక సంస్కృతి/ జలం ఒక చారిత్రక కృతి/ జలం సకల విన్యాసాల ఆవిష్కృతి.

భూమికి పురుడు పోసింది/నీరే కదా జలజలలాడే గుండెను/ గట్టి పరుచుకొని.

నీటిని కోరటమంటే/ జీవనసారాన్ని కాంక్షించటం/ మనిషీ! నీటిని తెలుసుకోవటమంటే/

నిన్ను నువ్వు తెలుసుకోవటమే.

చెరువులు బాల్యస్మృతిగా మారటం /ఎంత విషాదం/ చెరువులు కళేబరాలై పడి ఉండటం

/ఎంత విడ్డూరం!/చెరువుల్ని ఎవరెత్తుకు పోయారు.

 

 19.అలిశెట్టి ప్రభాకర్‌ :

అలిశెట్టి ప్రభాకర్‌ కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో 12 జనవరి 1951లో జన్మించారు. ‘అక్షర నక్షత్రం మీద’ అనే కవితా సంపుటిని రాశారు. కథలు, నాటకాలు, కావ్యాలతో ప్రసిద్ధికెక్కినవారున్నారు ఎంతో మందున్నారు కానీ.. కవితతోనే అందరినోటా జీవించిన కవి అలిశెట్టి. బస్టాండ్‌లో బేరమాడుతున్న ఒక వేశ్యను చూసి అప్పటికప్పుడు ఆమె బాధను తన బాధగా ఒక మినీ కవిత రాశారు. అది..

“ తను శవమై- ఒకరికి వశమై /తనువు పుండై/ ఒకడికి పండై/ఎప్పుడూ ఎడారై/ఎందుకో ఒయాసీస్సై..”.

పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలమూ కుంచే ఉంటాయి.. అంటాడు అలిశెట్టి. ఇవి నిజాయితీని ప్రతిబింబించే మాటలు.

అలిశెట్టి మొదట చిత్రకారుడు. ఆ తర్వాత కవితా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తన కవితలకు తాను చిత్రాలను వేసుకునేవాడు. జీవనం కోసం పోటోగ్రాఫర్‌గా పనిచేశాడు.

కవితా సంపుటాలు : ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ మొదలైనవి.

మరణం నా చివరి చరణం కాదు.. అని ప్రకటించుకున్న కవి అలిశెట్టి.

 

20.దాశరథి రంగాచార్యలు:

దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24న వరంగల్‌ జిల్లాలో చినగూడూరులో జన్మించారు.  ఈయన దాశరథి కృష్ణమాచార్యులు సోదరుడు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 17 ఏళ్ల వయసులోనే జైలుపాలయ్యారు. దాశరథి రచనలన్నీ సామాజిక వాస్తవ ఇతివృత్తంతో కూడినవే. రావినారాయణరెడ్డి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో చేరారు. అళ్వారు స్వామి ఆశయాలకు అనుగుణంగా నవలా రచనలు చేశారు.

అక్షర వాచస్పతి బిరుదు.

రచనలు:

చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జనపదం (నిజాం రాష్ట్ర పరిస్థితులే ఇతివృత్తులు ).

శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతం, వేదం-జీవననాదం-ప్రవేశిక, శ్రీమద్భాగవతం మొదలగు గ్రంథాలు రచించారు.

శరతల్పం, దేవదాసు ఉత్తరాలు, జనపదం, పావని, రానున్ననది ఏది నిజం?, జీవనయానం (ఆత్మకథ), కవితాకాదంబిని, జీలానిబాను కథలు, అక్షరమందాకికి, రణభేరి మొదలైనవి.

తొలిసారిగా నాలుగు వేద సంహితాలను తెలుగులో అందించిన ఆద్యుడు దాశరథి.

పది ఉపనిషత్తులను, రెండు బ్రాహ్మణములను వెన్నెల వచనంలో అందించిన రుషి, వాల్మీకి రామాయణాన్ని, భారత, భాగతాలను తెలుగులోకి అనువదించిన రూపశిల్పి దాశరథి రంగాచార్య.

ఈయన జూన్‌ 8, 2015 న మరణించారు.

 

21.అందెశ్రీ :

అందెశ్రీ వరంగల్‌ జిల్లాలోని జనగాం సమీపంలో ఉన్న రేబర్తి గ్రామంలో జన్మించారు. పశువుల్ని మేపుతూ పాటలు గట్టి జనం చేత జై కొట్టించుకున్న సాధారణ మనిషి అందెశ్రీ. “ప్రకృతే నా పాఠశాల, పల్లే నా పంతులు” అని చాటాడు. పాఠశాలకెళ్లీ చదువుకోకున్నా.. ప్రకృతి ఒడిలోనే చదువు నేర్చుకున్న నిరక్షరాస్య కవి అందెశ్రీ. పాడితే కంఠనాళం తెగిపడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి అంటూ “సూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి / నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి”అంటూ తల్లి రుణం, పల్లె రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాడు. మానవ సంబంధాలపై “మాయమై పోతున్నాడమ్మో.. మనిషన్న వాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు” అంటూ పాటకట్టాడు. “కొమ్మ చెక్కితె బొమ్మరా/ కొలిచిమొక్కితె అమ్మరా/ ఆదికే అది పాదురా/లేదంటే ఏదీ లేదురా” అంటూ సంస్కృతిని గుర్తు చేశాడు.

ఈయన రాసిన గేయాలు : పాటల పూదోట, వచన కవిత్వం : అందెల సందడి.

రాసిన తెలంగాణ గేయం : జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం/ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. ( ఈ పాట పాడింది గాయకుడు రామకృష్ట )

ప్రసిద్ధి చెందిన పాట : మాయమై పోతున్నడమ్మో మనిషన్నవాడు /మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడు.

అందెశ్రీ కలంనుంచి వెలువడే మహాగేయ కావ్యం – నదితో ప్రయాణం

‘అందెశ్రీ వాక్కులమ్మ’ అనే పద్య కావ్యాన్ని రచించాడు.

ఈయన చేసిన సాహిత్య సేవకు 1993లో భాగ్యనరం కల్చరల్‌ ఆర్ట్స్‌ అకాడమీ అందెశ్రీని ‘సహజ కవికోకిల’ అనే బిరుదుతో సన్మానించింది.

 

22.నందిని సిద్ధారెడ్డి :

నందిని సిధారెడ్డి జన్మస్థలం మెదక్‌ జిల్లాలోని కొండపాకం మండలంలో ఉన్న బండారం గ్రామం. కేసీఆర్ క్లాస్ మేట్ . ఈయన రాసిన ‘ప్రాణహిత’ కావ్యం ప్రసిద్ధి చెందినది. భూమిస్వప్నం, సందర్భం, ఒక బాధ కాదు మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు. వీటితో పాటు నాది పుట్టుక, ఇగురం(తెలంగాణ భాష, సంస్కృతి), తెలంగాణ కుల వృత్తుల సాహిత్యం, అవారతనము (తెలంగాణ సాహిత్యంపై వ్యాసాలు).  ఈయన ఎక్కువ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తన కవిత్వం ద్వారా ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

“నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ / నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ”.. అనే పాటకు 2010లో నంది అవార్డు అందుకున్నారు. ఈ పాట వీరతెలంగాణ సినిమాలో ఉంది.

జైబోలో తెలంగాణ సినిమాలో.. ఒకపువ్వు ఒకనవ్వు ఉయ్యాలలూగేనా.. అనే పాట రాశారు.

కొలిమి సినిమాలో పుడమి పండుగ పువ్వుల జాతర అనే పాట ప్రాచుర్యం పొందింది.

1986లో  మంజీర రచయితలం సంఘం స్థాపించారు. 2001లో తెలంగాణ రచయితల వేదిక స్థాపించారు.

1988లో దాశరథి అవార్డు అందుకున్నారు.

ఇతర రచనలు: భూమిస్వప్నం. సంభాషణ, ప్రాణహిత, ఒక్క బాధ కాదు, నాది పుట్టువడి, ఇగురం ( తెలంగాణా భాష మరియు సంస్కృతి ), తెలంగాణా కుల వృత్తుల సాహిత్యం, అవారతనము,

మచ్చుకు ఒక కవిత :

“మా తల్లీ దయగల తల్లీ /మేం సుత మొక్కుతం/మల్లెపూల దండ వేస్తం/మా నీళ్లెటు పోయినయో చెప్పు/గోదావరి కృష్ణమ్మలను గరగొర ఈడ్సుకపోతంటే/గొంతు విప్పవేం తల్లీ..”

పత్రికలు.. మంజీర, తెలంగాణా సోయి, జుంబి

 

23.నలిమెల భాస్కర్‌ :

నలిమెల భాస్కర్‌ బహుభాషా పండితుడు, బహుభాషా నిఘంటువు కర్త. తెలుగు భాషకు నిఘంటువులు చాలా ఉన్నా అవి అసలైన తెలుగు భాషకు సరైన నిఘంటువులు కావు. వాడుక భాషకు, మాండలిక భాషకు సరైన నిఘంటువు కావాలని గుర్తించి ‘తెలంగాణ పదకోశం’(2003) నిర్మించారు. తెలంగాణ మాండలికంలోని ఎన్నో పదాలను పరిచయం చేశాడు. ఆయన రాసిన ‘యార్కోషి’ కవితా సంపుటిలో తెలంగాణ కవులకు సైతం దొరకని మాండలిక పదాలను వాడారు.

‘సుద్దముక్క’ వచన కవితా సంపుటి, ‘మానవుడా’ అనే గేయసంపుటిలను వెలువరించారు.

ఈయన అనువాద రచనల్లో ‘దేశ దేశాల కవిత్వం’, ’47 కవితలు తమిళంలోకి’ ముఖ్యమైనవి. ఎన్‌.గోపి నానీలను కూడా తమిళంలోకి అనువదించారు.

 

24.గోరటి వెంకన్న :

గోరటి వెంకన్న మహబూబ్‌నగర్‌ తెల్కపల్లి మండలం గౌరారం గ్రామంలో 1963లో జన్మించారు. కవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజాగాయకుడు. రైతు సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984లో రాసిన “నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయెరో”అనే పాట ఈయనకు ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ‘అందుకోర గుతుపందుకో ఈ దొంగల తరిమేటందుకు’, ‘వీరులారా విద్యార్థులారా’ మొదలైన విప్లవ పాటలు రాశారు “పల్లే కన్నీరు పడుతుందో కనిపించని కుట్రల/నా తల్లీ బంధీయై పోతుందో..” అనే పాటతో పల్లె గొప్పదనంతో పాటు, పల్లెలో ఉన్నదయనీయ పరిస్థితులను వివరించారు. ఈ పాటతోనే ఈయనకు బాగా పేరు తెచ్చింది.

“గోరెంక పిట్టల సవ్వడేమాయె/రంగుల పిట్ట ఏ రాజ్యమెల్ల” అన్నటువంటి దేశీకవి, ప్రజాకవి.

గోరటి వెలువరించిన పాటల సంపుటాలు : ఏకునాదంమోత, రేలపూతలు, అలసెంద్రవంక.

తెలంగాణ ప్రభుత్వం వీరి సాహిత్య సేవను గుర్తించి 2015 సంవత్సరానికిగాను ‘ఉగాది పురస్కారం’తో సత్కరించింది.

 

Additional :

జక్కా వెంకటయ్య, పుచ్చలపల్లి సుందరయ్య గార్ల ప్రసంగాల ప్రభావంతో కమ్యూనిస్టు భావాలు, సాహిత్యాలపై ఈయనకు ఆసక్తి పెరిగింది.

ఈయన పాటలకు ప్రకృతి మూలాధారం. ఈయన రాసిన పాటలు అనేకం సీడీల రూపంలో వెలువడ్డాయి. వాటిలో జనంగోస, ఎట్లున్నవో ఏడున్నవో, తెలంగాణ వీణ.. మొదలైనవి.

గోరటి సృష్టించిన పల్లెటూరి అమాయక పోరగాడు ‘యలమంద’.  ప్రపంచీకరణలో లోకం ఎటుపోతున్నా వాడి లోకం మాత్రం గొర్లమందే. గొర్లు కాయట, గొర్లతోనే వాడి అనుబంధం. యలమంద పాటలో “యాడాదికోసారి లారెక్కి పోతుంటే.. యాడికోతున్నాయని తల్లినడుగుతాడు.. తండ్రినడుగుతాడు.. కన్నీళ్లు రాల్చుతాడు..” అని కరుణరసాత్మక దృష్యాన్ని చూపించి మన చేతే కన్నీళ్లు పెట్టిస్తాడు.

ఈయన బసవేశ్వరుడు, కబీర్‌, వేమన వంటి ఆధ్యాత్మిక ప్రజాకవుల స్మరిస్తూ ‘మానవీయులను మరువబోమన్న’ అన్న తత్వం రాశారు.

ఈయనకు ప్రజాకవి అనే బిరుదు కలదు. 2006లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘కళారత్న హంస’ పురస్కారం అందుకున్నారు.

ఈయన రాసిన కొన్ని పాటలు :

రాజ్యహింసా పెరుగుతున్నాదో/పేదోళ్ల నెత్తురు ఏరులయ్యీ పూరుతున్నాదో..

జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో..

నా పల్లె అందాలు చూసితే కనువిందురో..

ఎరుపు బట్టలు తెద్దామా.. ఎరుకలి బరుగుల తీసుక దొరల ఎంటపడి తరుముదామా.

పెన్నుల మీద మన్ను గప్పితే.. గన్నులై మొలకెత్తుతాయిరో.

తెలుగు గంగ నీళ్లు అలుగెళ్లి పోతుంటే..                పలుగు రాళ్లు తేలి పాలమూరు ఏడ్చింది.

 

25.జూలూరి గౌరీ శంకర్‌ :

జూలూరి గౌరీ శంకర్‌ తెలంగాణ పోరాట శీలిగా పేరు తెచ్చుకున్నారు. గౌరీ శంకర్‌ సంపాదకత్వంలో తెలంగాణ వకుల ఉద్యమ కవితా సంకలనం వెలువడింది. ‘పొక్కిలి’ అనే పేరుతో ఈ సంకలనం వెలువడింది. పొక్కిలిలో మొత్తం 129 మంది కవులున్నారు.

సృజనాత్మక సాహిత్యంలో ప్రసిద్ధుడు. 2013లో తెలుగు విశ్వవిద్యాలయం ‘సృజనాత్మక సాహిత్యంలో’ ‘కీర్తి పురస్కరాన్ని’ ప్రకటించారు.

దళిత కవిత్వంలోనూ, తెలంగాణ ప్రాంతీయ సాహిత్యంలోనూ, బీసీవాద కవిత్వంలోను తనదైన ముద్ర వేసుకున్న బలమైన గొతుక గౌరీశంకర్‌ ది. తొలి దీర్ఘకవిత ‘ఎలియాస్పొ’(2001) నుంచి 2007లో వచ్చిన చెకుముకిరాయి, మోదుగుల పొదుగు వరకు 14 దీర్ఘకవితలు రాశారు. 2005లో రాసిన నాలుగోకన్ను (బీసీ కవిత) ఒకే రోజు ఒకే సమయానికి 22 కేంద్రాల్లో ఆవిష్కరించబడటం విశేషం.

రచనలు :

పాదముద్ర, ఎలియాస్పొ, లికట్టె, వూరుచావు, నా తెలంగాణ, కాటు, సిలబస్‌ లో లేని పాఠం, ఓ నమ:శవాయ, మూడవ గుణపాఠం,మూలకాకి, ముండ్లకర్ర(1995 నుండి 2002 దాకా రాసిన కవితల సమాహారం), ఆధునిక కవిత్వం మొదలైనవి.

 

26.రాళ్లబండి కవితా ప్రసాద్‌ :

‘సప్తగిరిధామ కలియుగసార్వభౌమ’ మకుటంతో అపూర్వమైన కావ్యం రాసినటువంటి ద్విశతాధాని రాళ్లబండి కవితాప్రసాద్‌.

అవధానవిద్య నా కారవ ప్రాణమ్ము/పద్యకవిత్వమ్ము ప్రాణనాడి.. అని ప్రకటించుకున్నాడు.

‘ఒంటరి పూలబుట్ట’ పేరుతో దివ్యభావుతతో కవిత్వాన్ని పంచిపెట్టిన రత్నాలబండి రాళ్లబండి.

‘పలకరిస్తే పద్యం’  అనే వినూత్న ఆశుకవితా కార్యక్రమం నిర్వహించారు.

వచన కవితా సంపుటాలు : ధ్వని, దోసిట్లో భూమండలం, అగ్నిహింస, కవిసమయం.

 

 

 1. ప్రజా యుద్ధ నౌక గద్ధర్‌ :

గద్ధర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌. బిరుదు ప్రజాయుద్దనౌక మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌ లో 1949లో జన్మించారు.

గద్ధర్‌ ప్రజాగాయకుడు, విప్లవకవి. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని వివరించేందుకు, ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత ప్రజలకు తెలిపేందుకు బుర్రకథను ఎంచుకున్నారు. మహాత్మాగాంధీ బుర్రకత బృందాన్ని స్థాపించారు.  నక్సలైటు ఉద్యమంలో పాల్గొన్నారు.  జననాట్య మండలి ద్వారా ప్రజల్లోకెళ్లారు. సామాజిక సమస్యలతో పాటు తెలంగాణ అంశం గురించి అవగాహన కల్పించారు.

ఆయన మొదటి ఆల్బం పేరు.. గద్దర్.. అదే అయన పేరుగా స్ధిరపడింది.

మలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో ఉద్యమానికి మద్ధతుగా నిలిచారు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా..’ అనే పాట ఉద్యమానికి ఉత్ర్పేరకంగా మారిందనటంలో సందేహం లేదు. దీనితో పాటు “అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గాణమా” అనే పాట కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా ప్రాచుర్యం పొందింది.ఇది రాష్ట్ర గీతంగా కూడా ఎంపికకాబడింది.  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ.. ప్రతిజిల్లా గురించి వాటి సమస్యల గురించి తెలిపారు. మా భూమి సినిమాలో.. పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి.. బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి..

2010లో  ‘తెలంగాణ ప్రజాఫ్రంట్‌’ పార్టీ స్థాపించి ఉద్యమకారులను ఏకం చేశారు.

గద్ధర్‌ తొలిసారిగా ఒరేయ్‌ రిక్షా సినిమాకు పాటలు రాశారు. ఈ పాటల్లో “నా రక్తంతో నడుపుతాను రిక్షాను.. నా రక్తమే నా రిక్షకు పెట్రోలు” అనే పాట బాగా ప్రాచుర్యం పొందటమే కాకుండా.. రిక్షా కూలీల కష్టాలు కళ్లకు కట్టినట్లు తెలిపింది. మల్లెతీగకు పందిరివోలె.. మసకచీకట్లో వెన్నెలవోలే..

గద్దర్‌ పాటలలో బాగా ప్రాచుర్యం పొందిన పాట :

సిరిమల్లె సెట్టుకింద లచ్చువమ్మో లచ్చువమ్మ.. నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ.

ఓరోరి అమీనోడా /ఓరోరి సర్కిలోడ / పదిలంగ ఉండు కొడుకో/కదిలింది ఎర్రదండు.. పాటకూడా గద్ధర్‌ రాసిందే.

చీమల దండులు కదిలినాయి/పాముల గుండెలు అదిరినాయి/తోడేళ్లు తోకలు ముడిచినాయి/ఆవుల మందలు కదిలినాయి.. అని తిరుగుబాటును పురిగొల్పిన తూఫ్రాన్‌ కవి గద్ధర్‌.

1997లో గద్దర్ మీద హత్యాప్రయత్నం.

 

28.పెండ్యాల వరవరరావు :

వరంగల్ జిల్లా చిన్న పెండ్యాల స్వగ్రామం. వరవర అంటే.. శ్రేష్టులలో కెల్లా శ్రేష్టుడు అని అర్ధం. 1966లో సృజన అనే సాహితీ వేదికను స్థాపించారు. 1970 జులై 4న విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించాడు. చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), సముద్రం ( 1983), ముక్తకంఠం (1990), ఆ రోజులు, బాగ్దాద్ చంద్రవంక ( 2003), మోసం యుద్ధనేరం (2003), ప్రజలమనిషి, ఒక పరిచయం (1978), కల్పనాసాహిత్యం – వస్తువివేచన (2005) , సెక్యులరిజం – ఒక పరిశీలన., తెలంగాణా విమోచనోద్యమం- తెలుగు నవల.

1968లో చలినెగళ్లు గ్రంథానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ వచ్చింది.

భవిష్యత్‌ చిత్రపటం, ముక్తకంఠం.. మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు.

సృజన పత్రికా సంపాదకులు. యుద్ధోన్మాధానికి వ్యతిరేకంగా ‘మౌనం యుద్ధం నేరం’ రచించాడు.

వరవరరావు కవిత మచ్చుకు :

ఇవ్వాళ సముద్రం/సామ్రాజ్యవాద మరణశయ్యలాగున్నది/కల్లోల నక్సల్బరీ లాగున్నది.

పిల్లల్లారా తల్లివంటి విప్లవాన్ని చదవండి.. పిల్లల్లారా వెలుగువంటి విప్లవాన్ని చదవండి

ఆ.. అంటే అడవి, ఆ.. అంటే ఆయుధం..

29.చెరబండరాజు :

చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్‌రెడ్డి (1944-1982). ఈయన దిగంబర కవిగా పేరు పొందాడు.

దిక్సూచి, గమ్యం వంటి సంపుటాలు వెలువరించారు.

ఈయన రాసిన ‘వందేమాతరం’ (ఓ నా ప్రియమైన మాతృదేశమా) అనే కవిత వాదోపవాదాలకు దారి తీసింది.

“ఏకులమబ్బీ నీదేకులమబ్బీ..”, “కొండలు పగలేసినం-బండలను పిండినం” వంటి పాటలు రాశారు.

రచనలు : నన్నెక్కనివ్వండి బోను, ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది, జగద్గురువులొస్తున్నారు, జాగ్రత్త మొదలైనవి.

“కళం గళం ప్రాణపదం/ప్రజకి నేను అంకితం/పోరాటం డైరెక్షన్‌/పాట నాకు ఆక్సిజన్‌”.. అంటూ జీవితం, కవిత్వం వేరు కాదు, అంతా ప్రజల పక్షమే అని ప్రకటించాడు.

Add :

ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడి ఉందని గాఢంగా నమ్మిన వ్యక్తి చెరబండరాజు.

అలోచన, అక్షరం, ఆచరణ ఏకరూపం దాల్చిన విప్లవ కవి.

మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్తానం కావ్యాన్ని చెరబండరాజుకు అంకితమిచ్చాడంటే ఆయన గొప్పతనమేంటో చెప్పవచ్చు.

ఈయన విరసం వ్యవస్థాపక అధ్యక్షుడు. 1975 ఏప్రిల్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించిన సందర్భంలో శ్రీశ్రీతో పాటు అరెస్టయ్యాడు.

కవిత్వం :

దిగంబర కవితా సంకలనాలు(1965,1966,1968), దిక్సూచి, ముట్టడి), కమ్యం, కాంతియుద్ధం, గౌరమ్మ కలలు, జన్మహక్కు, పల్లవి, చెరబండరాజు కవితలు, కత్తిపాట మొదలైనవి.

 

30.ఎండ్లూరి సుధాకర్‌ :

ఈయన జన్మస్థలం నిజామాబాద్‌. తెలంగాణ కోసం తన కవితల ద్వారా ఉద్యమించారు ఎండ్లూరి సుధాకర్‌.

“బయటి శత్రువు కంటే ఇంటి శత్రువే ఖతర్నాక్‌..” అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన నాయకులపై విమర్శలకు దిగారు.

‘వర్తమానం’ పేరుతో కవితా సంకలనాలు వెలువరించారు. గూర్ఖా, మైసమ్మ, నల్లతల్లి వంటి కవితలు వర్తమానం ద్వారా వెలువరించారు. ఎండ్లూరి రాసిన ‘నల్ల ద్రాక్ష పందిరి’ దళితవాదానికి చెందినది. ఈయన రాసిన విశిష్ట దీర్ఘకావ్యం ‘కొత్తగబ్బిలం’.

“నేనింకా నిషిద్ధ మానవుణ్ణే/నాది బహిష్కృత శ్వాస”.. అన్నది ఎండ్లూరి సుధాకర్‌.

అటా జనికాంచె, గోసంగి, కొత్తగబ్బిలం, నల్లద్రాక్ష పందిరి,

 

31.సుద్దాల అశోక్‌ తేజ :

సుద్దాల హనుమంతు కుమారుడు సుద్దాల అశోక్‌ తేజ. సాహిత్య వాతావరణంలో పెరగటంతో చిన్ననాటి నుండే కవితలు, పాటలు రాయటం అలవాటు చేసుకున్నాడు.  తండ్రి హనుమంతు చివరి దశలో నాన్నకి స్మృతిగీతం పేరిట కవితా గీతాలు వివరించాడు. ఒసేయ్‌ రాములమ్మ, నిన్నే పెళ్లాడతా సినిమాలకు పాటలు రాసి వెలుగులోకొచ్చాడు. ఠాగూర్‌ సినిమాకు రాసిన ‘నేను సైతం’ అనే పాటకు 2003లో జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. శ్రీశ్రీ, వేటూరి తర్వాత ఈ అవార్డు అందుకున్న 3వ తెలుగు రచయిత సుద్దాల.

శ్రీశ్రీ – తెలుగువీరలేవరా దీక్షభూని సాగరా (అల్లూరి సీతారామ రాజు)

వేటూరి – రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ( మాతృదేవోభవ).

తెలుగు టెలివిజన్‌ రచయితల సంఘం అందించే ‘కాళోజీ’ పురస్కారాన్ని 2015కు గాను అందుకున్నారు.

“నేలమ్మ నేలమ్మ నేలమ్మ/నీకు వేల వేల వందనాలమ్మా” అనే పాటతో ప్రకృతిని వర్ణించిన తీరు అద్భుతం.

తన తల్లి దండ్రలు పేరిట ‘సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం’  ఏర్పాటు చేసి 2013 నుంచి సాహితీ సేవకులకు ప్రోత్సహిస్తున్నారు.

 • Ninne Pelladutha – 1996 – Naa mogudu raampyaari
 • Osey Ramulamma – 1997 – 6 songs
 • OkaTO number kurraaDu – Nemali kannodaa
 • Tagore – 2003 – Nenu Saitham
 • Murari – Bangaaru kalla buchamma
 • khaDgam – Aha Allari
 • Kante Koothurne Kanu
 • Chandamama – Regumullole
 • 6Teens – Nuvu Yadikelthe Aadikastha suvarna
 • Pandurangadu – Matrudevo bhava anna maaata
 • Badrachalam – Okate jananam Okate maranam
 • Yagnam – Tongi Tongi choodamoku chandamama
 • Vishnu – Raavoyi chanda mama
 • Rayala seema Ramanna Chowdary – title song and other songs
 • Are Pachi Pachiga – Movie Name: Political Rowdy
 • Kallu Terichi Choosa,Movie Name: Political Rowdy
 • Palle palleku Untavu Kapala,Movie Name: Apthudu
 • Toofan Ayi Nuvvu Ravali Ra,Movie Name: Apthudu
 • Devudu Varamandisthe,Movie Name: 6 Teens
 • Em chesavo, Movie Name: Yagnam
 • Ravoi Chandamama,Movie Name: Vishnu
 • Nee Pere Tanapyna,Movie Name: Vishnu
 • Papa Ro,Movie Name: Vijayendra Varma
 • Kallallo Draksha Rasam,Movie Name: Bobby
 • Kanapada leda,Movie Name: Bunny
 • Maylu Maylu,Movie Name: Bunny
 • Maa Colonylo,Movie Name: Apple
 • Money Money,Movie Name: Apple
 • Nuvva Nuvva,Movie Name: Apple
 • Paila Pachisu Pilla,Movie Name: Apple
 • Raghavendrudu,Movie Name: Apple
 • Chodo Chodo,Movie Name: Ayodhya
 • Jimmu Choodu,Movie Name: Ayodhya
 • Andala Aakashamantha,Movie Name: Chandramukhi
 • Chiluka Pada Pada,Movie Name: Chandramukhi
 • Ninnemo Paaparo,Movie Name: Seenugadu Chiranjeevi Fan
 • Jabilipaina,Movie Name: Paandu
 • Aaku Chaatu Pindelam,Movie Name: Fools
 • Holi Holi,Movie Name: Sree
 • Hylessa,Movie Name: Sri Ramadaasu
 • Varevva,Movie Name: Ranam
 • Jagadeka Veeruniga,Movie Name: Sri Krishna
 • Ramayya Ramayya,Movie Name: Hanumanthu
 • O Hanumanthu,Movie Name: Hanumanthu
 • Undipo Nesthama,Movie Name: Asthram
 • Maataltho Swarale,Movie Name: Amma Cheppindi
 • Hayire Hayire,Movie Name: Room Mates
 • Hayire Hayire,Movie Name: Room Mates
 • Suryude Selavni,Movie Name: Stalin
 • Adigadigo vastunnadu,Movie Name: Veede
 • Adugu Aduguna,Movie Name: Vijayaramaraju
 • Evaru Nuvvu,Movie Name: Vijayaramaraju
 • Gitarai Ne Padanaa,Movie Name: Uncle
 • Uncle Uncle Little Sta,Movie Name: Uncle
 • Rampa Chiku,Movie Name: Raana Old
 • Bangaru Chilaka,Movie Name: Raaraju
 • Chinnari,Movie Name: Chinnodu
 • Hey Manasa,Movie Name: Chinnodu
 • Buchimallu Buchimallu,Movie Name: Rayalseema Ramanna Choudary
 • Ramanna Ramanna,Movie Name: Rayalseema Ramanna Choudary
 • Yedura Ledinka,Movie Name: Rayalseema Ramanna Choudary
 • O_MALLEPUVVURA,Movie Name: Pellam Oorelithe
 • Ammo Ammammo,Movie Name: Satyam Shivam Sundaram
 • Oka Merupe,Movie Name: Naa Oopiri
 • Oka Poovula,Movie Name: Naa Oopiri
 • Chiguraku Yevaro,Movie Name: Jabili
 • Ganga Yamuna Godari,Movie Name: Jabili
 • Jolly Jolly College,Movie Name: Jabili
 • Pada Pada Nee,Movie Name: Jabili
 • Isdesh,Movie Name: Jenda
 • Ooru Vaada Akkallaaraa,Movie Name: Encounter
 • Palle Tellavaarutunnadaa,Movie Name: Encounter
 • Yudham Yudha,Movie Name: Encounter
 • Tamala paku nemali soku,Movie Name: Dil
 • Anda Chandala,Movie Name: Sakutumba Saparivara Sametam
 • Love Is The Feeling Of Life,Movie Name: Sakutumba Saparivara Sametam
 • Manasantha Manasupadi,Movie Name: Sakutumba Saparivara Sametam
 • Pachi Venna,Movie Name: Sakutumba Saparivara Sametam
 • Vallantha Tullintha,Movie Name: Sakutumba Saparivara Sametam
 • Kithaikthalu,Movie Name: Samba
 • Vagalaadi,Movie Name: Sardukupodam Randi
 • Krishna nuvvu raaku,Movie Name: Shiv Shankar
 • Nenemi chetanu,Movie Name: Shiv Shankar
 • Yemandi,Movie Name: Sivani
 • Mera,Movie Name: Sri Srimati Sathyabhama
 • Sathya,Movie Name: Sri Srimati Sathyabhama
 • Thittu,Movie Name: Sri Srimati Sathyabhama
 • Neredu Pallu,Movie Name: Subash Chandra Bose
 • Subhash Chandra Bose,Movie Name: Subash Chandra Bose
 • Oni Merupulu,Movie Name: Madhumasam
 • Balamanemmo,Movie Name: Leelamahal Center
 • Chitti Chilakamma,Movie Name: Leelamahal Center
 • Galiki Theliyani,Movie Name: Leelamahal Center
 • Paramapavana,Movie Name: Leelamahal Center
 • Sirimalle Puvvalle,Movie Name: Leelamahal Center
 • Mudda Banthi,Movie Name: Ninnu Choodalani
 • Aagadu,Movie Name: Chalo Assembly
 • Bhaj Dekh,Movie Name: Charminar
 • Malli Malli Nito,Movie Name: Dhanush
 • Alanati Rama Chandrudu.ra,Movie Name: Murari
 • Bangaaru Kalla.ra,Movie Name: Murari
 • Nuvvu Yaadikelthe,Movie Name: Girl Friend
 • Bhama Neetho,Movie Name: Intlo Srimathi Veedhilo Kumari
 • Arere Yemaindo,Movie Name: Kaasi
 • Kottu Kottu,Movie Name: Kaasi
 • Marugelaraa O Raghava,Movie Name: Kaasi
 • Patchi Venna,Movie Name: Kaasi
 • Punnami Jabili,Movie Name: Kaasi
 • Ye Marugelaraa O Raghava,Movie Name: Kaasi
 • Aha Allari,Movie Name: Khadgam
 • Indrudu Eetakallu,Movie Name: Kubusum
 • Neeli Megahalalo,Movie Name: Kubusum
 • Ningikegisinara,Movie Name: Kubusum
 • Nunugu Meesala,Movie Name: Kubusum
 • Holi Holi,Movie Name: Kushi
 • Yeppudu Chappudu,Movie Name: Manasutho
 • Ee Chali Galullona,Movie Name: Atili Sattibabu LKG
 • Ra Ra Ante,Movie Name: Atili Sattibabu LKG
 • Sahana,Movie Name: Sivaji
 • Vaaji Vaaji,Movie Name: Sivaji
 • Chalta Chalta,Movie Name: Raju Bhai
 • Evare Nuvvu Remix,Movie Name: Raju Bhai
 • Evare Nuvvu,Movie Name: Raju Bhai
 • Guchi Guchi,Movie Name: Raju Bhai
 • Kantipapa Kasirinda,Movie Name: Raju Bhai
 • Korameenu,Movie Name: Raju Bhai
 • Lothe Teliyanide,Movie Name: Raju Bhai
 • Neekosam Pilla,Movie Name: Raju Bhai
 • Sommunu,Movie Name: Raju Bhai
 • Baava Muripinchana,Movie Name: Bhukailas
 • Yen Chilako,Movie Name: Toss
 • Manishiki Yenduku,Movie Name: Himsinche 23va Raju Pulikesi
 • O Bapu Nuvve Ravai,Movie Name: Shankar Dada Zindabad
 • Kamala Pandu,Movie Name: Veedu Maamulodu Kaadu
 • Regumullole,Movie Name: Chandamama
 • Asale Chalikala,Movie Name: Mr and Mrs Sailaja Krishna Murthy
 • Maisamma,Movie Name: Maisamma IPS
 • Yeda Yedalo,Movie Name: Gauthama Budha
 • Vedane,Movie Name: Gauthama Budha
 • Ee Madhu Bala,Movie Name: Evarinaina Eduristha
 • Sakhude Sakhude,Movie Name: Naamanasukemayindi
 • Style Style,Movie Name: Aatadista
 • Homam Yuddham,Movie Name: Homam
 • Katti Naaku Gucchadammo,Movie Name: Homam
 • Magaallu Mee Maatalo,Movie Name: Homam
 • Pedavikidem Kasiro,Movie Name: Homam
 • Ye Pagale,Movie Name: Homam
 • Yey Mister Ninne,Movie Name: Homam
 • Agnigundam,Movie Name: Dhee Ante Dhee
 • Nelaku Jarene Chandamama,Movie Name: Dongala Bandi
 • Oorori Mavayyo,Movie Name: Dongala Bandi
 • Oo Mara Manishi,Movie Name: Robo(Telugu)
 • Inumulo Oo Hrudayam Karigine,Movie Name: Robo(Telugu)
 • Nijamena,Movie name: Jai Bolo Telangana
 • All songs, Movie name: Aa Aiduguru (2014 film)

 

 1. వట్టికోట అళ్వారుస్వామి:

వట్టికోట 1915లో నల్గొండ జిల్లా చెర్వు మాదవరంలో జన్మించాడు. 1938లో దేశోద్ధారక గ్రంధమాలను స్థాపించాడు.

ప్రజల మనిషి, గంగు నవల, రామప్పతల్లి వ్యాస సంపుటి, జైలు లోపల మొదలగు రచనలు చేశారు.

రామప్ప రభస/రగడ రాశారు. దీంట్లో రామప్ప అనే పాత్రద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించారు.

తెలుగుతల్లి.. మాస, వార పత్రికలను నిర్వహించారు.

Add :

పాఠశాల మాని గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. దాశరథి పద్యాలు జైలు గోడలపై రాసి దెబ్బలు తిన్నాడు. రచయిత, ఈయన సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణ కర్త, పాత్రికేయుడు, ప్రచారకర్త. నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నాడు. నిజాంను గడగడలాడించిన ‘ఆంధ్రమహాసభ’ నల్లగొండ జిల్లా అధ్యక్షుడుగా, కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టాడు. నిజాం నిరంకుశత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో జైలుపాలయ్యాడు. ఈయన జైలు జీవితం ‘జైలు లోపల’ కథల సంపుటిగా వెలువడింది.

వంట పనిలో, ప్రూఫ్‌ రీడింగ్‌లో, హోటల్‌ సర్వర్‌గా పనిచేసినపుడు ఆయన పొందిన అనుభవాలు ఆయనను ప్రజల మనిషిగా నిలబెట్టాయి.  కులమత బేధాలను ఖండించాడు.

 

33.అమ్మంగి వేణుగోపాల్‌ :

అమ్మంగి వేణుగోపాల్‌ ప్రముఖ రచయిత, సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు. తెలంగాణలో భాష, సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందించే కాళోజీ పురస్కారం (2015) అందుకున్నారు. (కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్‌ 9 ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది)

రచనలు : మిణుగురు, పచ్చబొట్టు-పటంచెరు, భరోసా మొదలైన కవితా సంపుటాలు. సాహిత్య సందర్భం, సమకాలీన స్పందన.. మొదలైనవి విమర్శ వ్యాసాల సంపుటి.

 

34.జ్వాలాముఖి (వీర రాఘవాచార్య) :

జ్వాలాముఖి మెదక్‌ జిల్లా ఆకారం గ్రామంలో 1938లో జన్మించారు. ఈయన ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు. అసలు పేరు వీర రాఘవాచార్య(కొందరు వీరవెల్లి రాఘవాచార్య అని పిలుస్తారు.) జ్వాలాముఖి అనే కలం పేరు ఆయన పేరుగా స్థిరపడిపోయింది..  దింగంబర కవులుగా ప్రసిద్ధి చెందిన ఆరుగురు కవులలో జ్వాలాముఖి ఒకరు. విరసం సభ్యుడు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలుగా రాశాడు. ఈయన 1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. విరసం కార్యక్రమాల్లో పాల్గొని జైలుకెళ్లారు.

రచనలు :

వేలాడిన మందారం (నవల), హైదరా‘బాధ’లు, ‘ఓటమి తిరుగుబాటు’ (కవితా సంకలనం), రాంగేయ రాఘవ (జీవిత చరిత్ర.. హిందీ నుంచి తెలుగుకు అనువాదం.)

అవార్డులు :

ఝాన్సీ హేతువాద మెమోరియల్‌ అవార్డు, దాశరథీ రంగాచార్య పురస్కారం, హిందీలో వేమూరి ఆంజనేయశర్మ అవార్డు.

నోట్‌ : దిగంబర కవులు :

1.నగ్నముని-మానేపల్లి హృషికేశవరావు, 2.నిఖిలేశ్వర్‌-యాదవరెడ్డి, 3.చెరబండరాజు-బద్దం భాస్కర్‌ రెడ్డి, 4.మహాస్వప్న-కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, 5.జ్వాలాముఖి-వీరరాఘవాచార్యులు, 6.భైరవయ్య-మన్మోహన్‌ సహాయ.

 

35.ఆచార్య బిరుదురాజు రామరాజు :

వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవనూరులో 1925లో జన్మించారు. ఈయన జానపద సాహిత్యంపై కృషి చేసిన ప్రముఖ రచయిత. బాల్యం నుంచే ఆర్యసమాజం,ఆంధ్రమహాసభ, స్టేట్‌కాంగ్రెస్‌ ఉద్యమాల్లో పాల్గొన్నాని లాఠీ దెబ్బలు తిన్నారు. ఆంధ్రమహాసభల సందర్భంగా మహాత్మగాంధీ వరంగల్‌ వచ్చినపుడు వాలంటీర్‌గా పనిచేసి, గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. స్వాతంత్రోద్య సమయంలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.

 

 

రచనలు :

ఆంధ్రయోగులు(నాలుగు సంపుటాలు), సంస్కృత సాహిత్యానికి తెలుగు వారి సేవ, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, తెలుగు వీరుడు, తెలుగు జానపద రామాయణం, వీరగాథలు, యక్షగాన వాజ్మయము, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి.

 

36.విద్వన్మణి. :

విద్వన్మణిగా పిలిచే రవ్వా శ్రీహరి నల్లగొండ జిల్లాలో జన్మించారు. మొట్టమొదటా భాస్కర రామాయణంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు.  భాస్కర రామాయణ కర్తృత్వం ఎంతో వివాదాస్పదం. అలాంటి దానిని స్వీకరించి కొత్త ప్రతిపాదనలతో, కావ్య విశ్లేషనతో రాశారు. ‘అలబ్ద కావ్య పద ముక్తావలి’ (లభ్యం కాని రచనలను వెలుగులోకి తెచ్చారు.) ఎర్రన రామాయణం రాశారు కానీ అలభ్యం. వీటిని సేకరించి పుస్తకంగా వెలువరించారు. ‘తెలుగు కవుల సంస్కృతానుకరణలు’ ప్రామాణిక పరిశోధన గ్రంధం. జాషువా రాసిన పిరదౌసి, గబ్బిలం, కావ్యాలను సంస్కృతంలోకి రాశారు. సినారె ‘ప్రపంచ పదులు’, శేషప్ప నారసింహ శతకం, వేమన శతకాలను సంస్కృతంలోకి అనువదించారు. ‘వాడుక భాషలో అపభ్రంశాలు’ లతో వాడుక భాషా పదాలను పుస్తకరూపంలో తెచ్చారు.

నిఘంటువులు :

శ్రీహరి నిఘంటువు, అన్నమయ్య పదకోశం, సంకేత పదకోశం, వ్యాకరణ పదకోశం, నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం.

విమర్శనా గ్రంథాలు :

ఉభయ భారతి, అన్నమయ్య సూక్తి వైభవం, తెలుగులో అలబ్ధ వాజ్మయం, సాహితీ నీరాజనం, నల్లగొండ జిల్లా ప్రజల భాషా, తెలంగాణా మాండలికాలు-కావ్యప్రయోగాలు.

37.కూరెళ్ల విఠలాచార్య :

పల్లెటూళ్లో సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ తన ఇంటినే సాహితే కుటీరంగా మార్చుకున్న రచయిత విఠలాచార్య. నల్లగొండ జిల్లాకు చెందిన రచయిత. యువకులంతా పట్టణాలకు వెళ్తున్న సమయంలో పల్లెలో ఉంటూ గ్రామాల సంస్కృతిపై అనేక రచనలు చేశారు. మారుమూల ప్రాంతాల్లో సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

రచనలు :

గోవిలాపం, స్మృత్యంజలి, తెలంగాణ కాగడాలు, కవితా చందనం, శిల్పాచార్యులు, దొందూ దొందే, సింగిసింగడు, మన కథ మొదలైనవి. విఠలేశ్వర శతకం ఎంతో ప్రాచుర్యం పొందింది.

 

38.చేరా :

చేరా పూర్తి పేరు చేకూరి రామారావు. ఖమ్మం జిల్లా తాలూకా ఇల్లిందులపాడులో జన్మించారు. వచన కవిత్వంలో దిట్ట. ఆధునిక సాహిత్య విమర్శకునిగా పేరు పొందారు. వాడుక భాష కొత్త పుంతలు తొక్కించేందుకు ఎంతగానో కృషిచేశారు.

రచనలు :

తెలుగువాక్యం, వచనరచన తత్వాన్వేషణ, సాహిత్య కిర్మీకం, భాషా పరివేశం, తెలుగులో వెలుగులు, స్మృతి కిణాంకం, ఇంగ్లీషు-తెలుగు పత్రికా పదకోశం, ముత్యాల సరాల ముచ్చట్లు , చేరా పీఠికలు మొదలైన రచనలు చేశారు. 2000 సం.లో రాసిన సాహిత్య కిర్మీకం 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుంది.

 

 

39.అంపశయ్య నవీన్‌ :

అంపశయ్య నవీన్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలా గ్రామం. ఈయన అసలు పేరు దొంగర నవీన్‌. ‘అంపశయ్య’ అనే నవలతో అంపశయ్య నవీన్‌గా పేరుపొందారు. దాదాపు ముప్పైకి పైగా నవలలు, వందల కథలు రాశారు. ఏది రాసినా చర్చనీయాత్మకంగా రాయటం వారి నైజం. చైతన్య స్రవంతి ధోరణిలో కళాశాల జీవిత స్థితిగతుల్ని చిత్రిస్తూ అంపశయ్య రాశారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను వివరిస్తూ ‘చీకటి రోజులు’ అనే నవలను రాశారు. ఈయన రాసిన నవలలన్నీ ఒక ఎత్తు, ‘కాలరేఖలు’ ఒక ఎత్తు. 2004లో దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 1944-56 వరకు తెలంగాణ రాజకీయ, సాంఘిక పిరిస్థితుల్ని ప్రతిబింబించే ఈ నవల.. వేయిపడగలు, మాలపల్లి, చిల్లరదేవుళ్లు వంటి వాటి సరసన చేరింది. పాఠకుల సౌలభ్యం కోసం కాలరేఖలు నవలను కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు అనే మూడు నవలలుగా రాశారు. అంపశయ్య, ముళ్లపొదలు, అంతస్రవంతి నవలల్లో కథానాయకుని పేరు రవి కావటంతో.. ఈ మూడు నవలలను రవిత్రయ నవలలు అంటారు.

మరికొన్ని నవలలు :

రక్తకాసారం, చీకటిరోజులు, మనోరణ్యం, విచలిత, సంకెళ్లు, దాగుడుమూతలు, ప్రత్యూష, చెమ్మగిల్లని కన్నులు, తీరని దాహం, మౌనరాగం, తారుమారు, దృక్కోణాలు మొదలైనవి.

కథా సంకలనాలు :

ఫ్రం అనురాధ విత్‌ లవ్‌, ఎనిమిదో అడుగు, లైఫ్‌ ఇన్‌ ఎ కాలేజ్‌, నిష్కృతి, బంధితులు, అస్మదీయులు-తస్మదీయులు మొదలైనవి.

వ్యాససంకలనాలు :

నవీన్‌ సాహిత్య వ్యాసాలు, సాహిత్య కబుర్లు, జీవనశైలి(ప్రజాశక్తి కాలమ్‌), సినిమా వీక్షణం, మనోవైజ్నానిక నవలల విశ్లేషణ, సప్తవర్ణాల హరివిల్లు(సాహిత్య వ్యాసాలు) మొదలైనవి.

 

40.మగ్దుం మొయినొద్దీన్‌: (1908-1969)

ఈయన ఉర్దూ కవి. మెదక జిల్లాలోని ఆందోల్‌ గ్రామంలో జన్మించారు. ఆంధ్ర కమ్యూనిస్ట్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. స్వాతంత్ర్యోద్యంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనం కోసం నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారు. రచనల ద్వారా వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నాడని, ఇతనని చంపమని నిజాం ఆదేశించాడంటే ఈయన పెన్నుకున్న పదునేంటో అర్థమవుతుంది. 1952లో హుజుర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా, 1958లో ఎమ్మెల్సీగా సేవలందించారు.

రచనలు :

బిసాత్‌-ఎ-రక్స్‌, సుర్క్‌ సవేరా, ఠాగూర్‌, ఖూన్‌ కె నాఖూన్‌ (ఠాగూర్‌ గారి మెప్పు పొందింది.), ఏ జంగ్‌ హై జంగే ఆజాదీ (ఈ గేయం భారతదేశమంతటా ప్రకంపనలు సృష్టించింది.), భాగమతి ( ఈ కవితో ఎంతో ప్రచారం పొందింది.)

బిరుదులు :

షాయర్‌ – ఎ – ఇంక్విలాబ్‌ (Poet of the revolution)

అవార్డులు :

సాహిత్య అకాడెమీ అవార్డు(1969)- ఉర్దూ సాహిత్యం), సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డు.

 

 1. బూర్గుల రామకృష్ణారావు :

హైదరాబాద్‌ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన బూర్గుల.. రాజకీయాలతో పాటు బహుభాషా వేత్తగా, రచయితగా కూడా తన ముద్ర వేశారు. ఈయన మహబూబ్‌నగర్‌ జిల్లా పడకల్‌ గ్రామంలో 1899 మార్చి 13న జన్మించారు.

రచనలు :

కృష్ణశతకం,  సారస్వత వ్యాస ముక్తావళి, ద డ్రీమ్స్‌ ఆఫ్‌ పోయెట్స్‌ (ఆంగ్ల రచన) మొదలైనవి.

సారస్వత వ్యాస ముక్తావళి – ఇది ఒక వ్యాస సంకలనం. దీనిలో .. నండూరి వారి ఎంకి పాటల ప్రాశస్త్యం, రెడ్డి రాజుల నాటి మత, సాంఘిక పరిస్థితులు వివరించారు. అప్పకవి తెలంగాణ వాడని నిర్ణయించారు.

దాశరథి ‘గాలిబ్‌ గీతాలు’, ఆత్మానందస్వామి ‘మేఘసందేశం’, వామనామలై ‘పోతన చరిత్ర’ లకు పీఠిక రాశారు.

ఇవే కాకుండా పారశీ వాజ్ఞయ చరిత్రను తెలుగు వారికి అందించాడు. హిందీలో ఆంధ్రమహాభాగవతాన్ని సమీక్షించారు. ‘ఉమర్‌ ఖయ్యూం’ను తెలుగులోకి అనువదించారు.

 

 

 1. గంగుల శాయిరెడ్డి

తెలంగాణ రైతుల జీవితాన్ని సాహిత్యంగా మలిచిన గంగుల శాయిరెడ్డి వరంగల్‌ జిల్లాలో 1890లో జన్మించారు. పోతన వారసత్వాన్ని ఆవాహన చేసుకొని వ్యవసాయ జీవితంలోని కడగండ్లను పరిష్కరించటానికి ఒక చేత హలం మరొక చేత కలం పట్టిన కవి శాయిరెడ్డి. తెలంగాణ సాహిత్య చరిత్ర మొదటి వరుసలో పేర్కొనదగిన శాయిరెడ్డికి ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు సముచిత స్థానమివ్వలేదు. ఒక వైపుగా కవిగా తన రచనలకు పదును పెడుతూనే మరోవైపు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.  నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. రజాకార్ల ఆకృత్యాలను ఖండించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు.

 • భువనగిరి, నెల్లుట్ల, గుముదవెల్లి గ్రమాల్లో విద్యార్థుల కోసం హాస్టళ్లు కట్టించారు.
 • వయోజన విద్య కొరకు నాలుగు బాలశిక్షలను రచించారు.
 • ఈయన 1937లో ప్రచురించిన ‘కాపుబిడ్డ’ కావ్యం సురవరం ప్రతాపరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావుల చేత ప్రశంసలందుకుంది.

 

 1. సర్వదేవభట్ల నరసింహమూర్తి :

కవిరాజమూర్తి గా బిరుదు పొందిన నరసింహమూర్తి 1926లో ఖమ్మం జిల్లా పిండిప్రోలులో జన్మించారు. బాబాయి (రామనాథం) స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. 1946 ఖమ్మం ఆంధ్రమహాసభ ప్రభావంతో కమ్యూనిస్టు భావజాలాన్ని అలవరుచుకున్నారు. కోఠిలో ఓ చిన్న గదిలో ఉంటూ యువరచయితలను ప్రోత్సహిస్తూ.. “ప్రజా సాహిత్య పరిషత్తు” స్థాపించారు. ఉర్దూలో ఆయన కవిత్వ పటిమకు మెచి నిజాం సర్కారు ‘ప్రజాకవిరాజు’ బిరుదునిచ్చింది. అదే తరవాతి కాలంలో కవిరాజమూర్తిగా మారిపోయింది.

రచనలు :

మై గరీబ్‌ హూ (ఉర్దూ), లహూకీ లకర్‌ (రక్తరేఖలు) మొదలగు నవలలు  రాశారు. ఈయన రాసిన నాటిక ‘మార్పు’ ప్రస్తుతం లభించుటలేదు. ఈయన రాసిన ‘అంగారే (నిప్పురవ్వలు)’ కవితా సంపుటి మంచి ప్రాచుర్యంపొందింది.

 • 1949లో ఉర్దూలో ‘తెలంగాణ’ అనే ఉర్దూ పత్రిక నడిపారు.
 • మై గరీబ్‌ హూ – అనే ఉర్దూ నవలలో ప్రధాన పాత్రధారుడైన అపరిచితుడు ఆయనే. ఈ నవల ద్వారా తన జీవితం, తన సమాజం, తనకు ప్రభుత్వంపై గల ఆగ్రహాన్ని తెలిపారు.

 

 

 

 

 

 

 1. వెల్దుర్తి మాణిక్యరావ్‌ :

కలమే ఆయుధంగా ప్రజల్లో చైతన్యం కల్గించిన మాణిక్యరావ్‌ మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో 1913లో జన్మించారు. ఒక వైపు రచయితగా మరో వైపు పాత్రికేయుడిగా ప్రజా చతన్యాన్నికి కృషి చేశారు. సురవరం ప్రతాపరెడ్డి సహాయంతో ‘గోలకొండ’ పత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు.   నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ‘రైతు’ (1946 లో) అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో నిజాం ప్రభుత్వ అణచివేతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. నిజాం ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా, ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత కొన్నాళ్లు అజ్ఙాతంలో గడిపారు.

రచనలు :

మాడపాటి వారి జీవితం, సర్దార్‌ జమలాపురం కేశవరావ్‌ జ్ఞాపకాలు, రాజ్యాంగ సంస్కరణలు, హైద్రాబాద్‌ స్వాతంత్రోద్యమ చరిత్ర మొదలైన రచనలు చేశారు.

 • 1939లో ‘అరుణా గ్రంథమాల’ అను ప్రచురణ సంస్థలకు సంపాదకులుగా వ్యవహరించి ఎన్నో ఉత్తమ గ్రంథాలను వెలువరించారు.

 

 

 1. చుక్కారామయ్య :

విద్యా వేత్తగా, సామాజిక వేత్తగా పరిచితులైన చుక్కా రామయ్య స్వతహాగా రచయిత కూడా. ఈయన వరంగల్‌ జిల్లా గూడూర్‌లో 1925లో జన్మించారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ ప్రేరణ వల్ల అస్పృశ్యత నివారణ ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాంకు మరియు రజాకార్లకి వ్యతిరేక ఉద్యమంలో పాల్గి చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించారు. తర్వాత హైదరాబాద్‌ నల్లకుంటలో ఐ.ఐ.టి. ఎంట్రెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించి ఐ.ఐ.టి. రామయ్యగా గుర్తింపు పొందారు. 2007లో ఎమ్మెల్సీగా గెలుపొందారు.

రచనలు :

చిన్న పాఠం, దేశ దేశాల్లో విద్య, బడిపంతుళ్లకు రాజకీయాలా, చదువుల తోవ, చదువులో సగం, చిట్టి చేతులు, జ్ఞాన లోగిళ్లు, ఇంటి భాష, లెక్కలతో నా ప్రయాణాలు, మన చదువులు, ప్రాథమికం, ప్రపంచీకరణ-విద్య,  రామయ్య జ్ఞాపకాలు, సంక్షేమ విద్య, సంవాదం, తరగతి మొదలైనవి.

 

 1. : యశోధారెడ్డి :

గ్రామీణ జీవిత కథకురాలిగా పేరుపొందిన యశోధారెడ్డి, స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ఒకరు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేసిన ఆమె, తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఎప్పటికీ తెలంగాణ యాసలో మాట్లాడటమే కాకుండా, తెలంగాణ యాసలోనే రచనలు చేశారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి జీవన సౌరభాన్ని అక్షరబద్ధం చేశారు.

రచనలు :

మావూరి ముచ్చట్లు – 1973 ( 1950 నాటి తెలంగాణ గ్రామీణ సంస్కృతి ), ధర్మశాల (1999), ఎచ్చమ్మ కథలు ( 2000), ఎదుర్కోలు (పెళ్లలోని ఎదుర్కోలు సంప్రదాయం గురించి).  వీటితో పాటు గ్రామీణ ఆడపడుచుల ముచ్చట్లు, బతుకమ్మ, పీర్లపండగను జరుపుకునే సంప్రదాయాలను చిత్రీకరించారు.

 1. : సాహు, అల్లం రాజయ్య :

వీరిద్దరూ విప్లవ రచయితలు. సాహు పూర్తి పేరు శనిగరం వెంకటేశ్వర్లు. వీరిద్దరు కలిసి రాసిన నవల ‘కొమురం భీమ్‌’ (1983). ఈ రచనను విప్లవ రచయితల సంఘం (విరసం) ప్రచురించింది.

 1. బున్న అయిలయ్య :

తెలంగాణ సాహిత్య సంస్థల పరిశోధకుడు బున్న అయిలయ్య. ఈయన గిరిజా మనోహరబాబు గారి ‘షష్టిపూర్తి’ సంచికను వెలువరించారు. ‘కాలువ మల్లయ్య’ కథల్లో తెలంగాణ జనజీవితాన్ని విశ్లేషించారు. ‘తెలంగాణ సాహిత్య సంస్థలు’ ఇతని పరిశోధనలో అతిముఖ్యమైన గ్రంథం.

 1. జయధీర్‌ తిరుమల రావు :

విప్లవ కవిత్వం నుంచి పరిశోధనల వైపు మొగ్గు చూపిన జయధీర్‌ తిరుమల రావు హన్మకొండలో 1950లో జన్మించారు. పరిశోధనల ద్వారా మరుగున పడిన కథలను వెలుగులోకి తెచ్చారు.

రచనలు :

అరుణ నేత్రం (కవితా సంపుటి )- కవిగా గుర్తింపు తెచ్చిన రచన, తెలంగాణ ఉద్యమకవి సుద్దాల హనుమంతుపై పుస్తకం రాశారు. రాష్ట్రమంతా తిరిగిన అనుభవాలతో ‘తొవ్వ ముచ్చట్లు’ రాశారు. నరహరి గోపాలకృష్ణ సెట్టి శ్రీరంగరాజ చరిత్ర నవలకు ముందుమాట రాశారు. స్త్రీ వాద కవిత్వంపై సాహితీ సర్కిల్‌ పేరున వెలువడిన ‘స్త్రీవాద కథలు’ కి గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు.

పరిశోధనల ద్వారా వెలుగులోకి తెచ్చిన రచనలు :

అలనాటి సాహిత్య విమర్శ (ఆముద్రిత గ్రంధ చింతామణి పత్రిక ఆధారంగా), గురజాడ డైరీలు, తెలుగులిపి పరిణామం – అభివృద్ధి, సురవరం ప్రతాపరెడ్డి లేఖలు.

పరిశోధనలు :

తెలంగాణ రైతాంగ పోరాటం-ప్రజాసాహిత్యంపై విశిష్టమైన పరిశోధన జరిపారు. గోండి, కోయ భాషలపై పరిశోధన చేశారు. ఈ భాషలకు ‘గుంజాల’ లిపిని వాడుకలోకి తేవటానికి ప్రయత్నిస్తున్నారు.

 1. అల్లం నారాయణ :

కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో జన్మించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ వాణి వినిపించిన సుప్రసిద్ధ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌.

ఈయన కవితలు :

 1. యాది- మానాది (2002) : ఇది ప్రజాతంత్రలో రాసిన దీర్థకవిత. తెలంగాణ ఉద్యమ తీవ్రతకు పదును పెట్టే కవిత ఇది.

2.జగిత్యాల పల్లె (2002) : పొక్కిలి అనే కవితా సంకలనం లో ఈ కవిత కనిపిస్తుంది. పొక్కిలి కోసం 2002లో జూలూరు గౌరీ శంకర్‌ 129 మంది కవులను ఏకతాటిపైకి తెచ్చాడు.

ఈయన రాసిన ‘జగిత్యాల పల్లె’లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ప్రజలు ఎలా నలిగి పోయారో కళ్లకు కట్టినట్లు చూపించారు.

 1. ఈ కాలపు ద:ఖం (2004) : ఈ కవిత ద్వారా తెలంగాణ భాషా విధ్వంసాన్ని చిత్రీకరించారు.

ఈయన రాసిన వ్యాసం – ప్రాణహిత. ఇందులో జర్నలిస్టులకు అభిప్రాయాలుంటాయి. రాజకాలు, ఇష్టాయిషటాలూ ఉంటాయి.

 

 1. సంగిశెట్టి శ్రీనివాస్‌ :

సంగిశెట్టి శ్రీనివాస్‌ రాసిన గొప్ప రచన ‘షబ్నవీస్‌’. షబ్నవీస్‌ అంటే చీకటిలో కూడా రాయగలిగిన లేఖకుడు. షబ్నవీస్‌ గ్రంధం 1886 నుండి 1956 వరకు తెలంగాణలో పత్రికారంగం, చీకటి కోణాలను వెల్లడించింది.

ఈయన వట్టికోట అళ్వారుస్వామి పై పరిశోధన చేశారు. తెలంగాణ తొలి తెలుగు పత్రికగా శేద్యచంద్రిక  అని సింగిశెట్టి నిర్ధారించారు. ఇది ఉర్దూ పత్రిక అనువాదం.

 

 1. పరావస్తు లోకేశ్వర్‌ :

రచనలు :

వ్యక్తి చిత్రాలు, పరిచయస్తుల జీవిత రేఖలు, ముసాఫిర్‌, ఛత్తీస్‌ఘడ్‌ సాహసయాత్ర, సిల్కరూట్‌లో సాహస యాత్ర.

ఈయన రాసిన ‘సలాం హైదరాబాద్‌’ రచనకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.

 

 

మరింత సమాచారం :

 • ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. అనే పాటను రాసినది – గూడ అంజయ్య. నిజాం పాలనకు వ్యతిరేకంగా పాటలను రాశారు. విప్లవ కవి.
 • తెలంగాణ కవులలో దిగంబర కవులు : చెరబండరాజు (బద్ధం భాస్కర్‌ రెడ్డి), జ్వాలాముఖి (ఏ.వి.రాఘవాచార్యులు), నిఖిలేశ్వర్‌ (యాదవరెడ్డి).
 • అనుమండ్ల భూమయ్య రచనలు : వేయినదుల వెలుగు, వెలుగనగల హంస, అగ్ని వృక్షము, జ్వలిత కౌసల్య, చలువ పందిరి మొదలైనవి. అర్వాచీన తాత్విక కవిగా పేరుంది.
 • విప్లవ రచయితల సంఘం (విరసం) 1970 లో ఆవిర్భవించింది.
 • ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. అనే పాటను రాసినది – గూడ అంజయ్య. నిజాం పాలనకు వ్యతిరేకంగా పాటలను రాశారు. విప్లవ కవి.
 • నరుడో, భాస్కరుడో, చెల్లీ చెంద్రమ్మా.. వంటి పాటలు రాసినది శివసాగర్‌. ఈయన విప్లవ కవి.
 • స్త్రీవాద కవితా సంపుటానికి నాంది పలికిన రచన – శిలాలోలిత (34 కవితలు). 1981లో ప్రచురితమైంది. రేవతీదేవి రచించారు.
 • 1990లో త్రిపురనేని ప్రచురించిన స్త్రీవా కవితల సంకలనం – గురిచూసి పాడే పాట.
 • తెలంగాణ స్త్రీ వాద కవయిత్రులలో పేర్కొనదగిన వారు : షాజహానా, అనిశెట్టి రజిత, శిలాలోలిత జాజుల గౌరి, జూపాక సుభద్ర.
 • జయధీర్‌ తిరుమలరావు సంపాదకత్వంలో వెలువడిన సంకలనం – దళితగీతాలు (1993).
 • చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట.. మొదలైన సంకలనాలు ఎవరి సంపాదకత్వంలో వెలువడ్డాయి – త్రిపురనేని శ్రీనివాస్‌, జి.లక్షీ నరసయ్య.
 • ప్రత్యేక కావ్యాలను వెలువరించిన దళితవాద కవులుగా పేరుతెచ్చుకున్న కవులు :
 • బి.ఎస్‌.రాములు, జూలూరి గౌరీ శంకర్‌, బన్న బల్లయ్య, కలేకూరి ప్రసాద్‌.
 • ముస్లింలలో నెలకొన్న భద్రతారాహిత్యం, ఛాందసత్వం, దారిద్ర్యాలను వస్తువులుగా చేసుకొని కవితా రచన చేసినవారు : యకూబ్‌ (అవ్వల్‌కల్మ), స్కైబాబా, దిలావర్‌, అఫ్సర్‌, ఖదీర్‌ ఖాజా, షాజహానా మొదలైనవారు.
 • స్కైబాబా సంపాదకత్వంలో వెలువడిన కవితా సంకలనం – జాగో జాగావో.
 • మైనారీ వాద కవిత్వానికి మచ్చు తునుక – ‘జల్‌ జలా’ కవితా సంపుటి.
 • సింగిడి తెలంగాణ రచయితల సంఘం వెలువరించిన కవితా సంకలనాలు : క్విట్‌ తెలంగాణ (2010), దిమ్మస (2011).

 

Advertisements

1 Comment

 1. Kuaktla thirupathi says:

  మిత్రమా
  మీ ప్రయత్నానికి అభినందనలు
  ఇంకా తెలంగాణలో వున్న కవులందరిని చేర్చితే సమగ్రంగా వుంటుంది. భావితరాలకు వుపయుక్తంగాను వుంటుంది

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: